Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు విజయ్ నెంబర్ వన్ హీరోగా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు వెళ్లిపోయాడు. కాబట్టి తను సినిమాలు చేసే అవకాశామైతే లేదు. ఇక రీసెంట్ గా ‘జన నాయకుడు’ అనే సినిమాను తన చివరి సినిమాగా రిలీజ్ చేశారు. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి పెద్దగా ప్రభావాన్ని చూపించలేక పోయిందనేది వాస్తవం. ఇక విజయ్ తర్వాత తమిళ్ సినిమా ఇండస్ట్రీని ఏలే హీరో ఎవరు? నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునే హీరో ఎవరు అవుతారు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పుడున్న హీరోల్లో సూర్య ముందు స్థానంలో ఉన్నాడు. ఆయన వరుసగా విజయాలను సాధించినట్లయితే మాత్రం ఆయన నెంబర్ వన్ పొజిషన్ అందుకునే అవకాశమైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే సూర్య చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి కొన్ని సినిమాలు తేడా కొడుతున్నాయి.
ఆయన స్టోరీస్ సెలక్షన్స్ బాగానే ఉన్నప్పటికి సినిమా స్క్రీన్ మీదకి వచ్చేసరికి మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే సినిమాలు కొన్ని మాత్రమే వస్తున్నాయి. అందులో తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్నాయి.
కాబట్టి ఆయా హీరోలు దర్శకులు సూపర్ హిట్లను సాధించడం మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… సూర్య లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో కొంత వరకు విజయాలను సాధించినప్పటికి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో కూడా ఉన్నాడు.
ప్రస్తుతము ఆయన చేస్తున్న సినిమాలతో సక్సెస్ ను సాధిస్తాడా? ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమాలు చేయగలుగుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇప్పటి వరకు తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో సాధించే విజయాలకంటే ఎక్కువ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది…






