Jagan Sensational Move on YSRCP Leaders : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతపై వేటు వేసింది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయానికి వచ్చింది. మరో ఇద్దరు కార్పొరేటర్ల పై సైతం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ హై కమాండ్. గుంటూరు మాజీ మేయర్, సీనియర్ నేత కావటి మనోహర్ నాయుడుతో పాటు ఇద్దరు కార్పొరేటర్ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మనోహర్ నాయుడు గుంటూరు మేయర్ గా ఉండేవారు. కొద్దిరోజుల కిందట ఎవరికీ చెప్పకుండా మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయని.. అందుకే సస్పెండ్ చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
* వైసీపీకి బలం ఉన్నా..
కొద్దిరోజుల కిందట గుంటూరు మేయర్ పీఠాన్ని టిడిపి కూటమి( TDP Alliance ) కైవసం చేసుకుంది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. కానీ మేయర్ విషయంలో మాత్రం ఆ పార్టీ వైఫల్యం చెందింది. అయితే మేయర్ పదవికి రాజీనామా చేసి టిడిపి కూటమికి మనోహర్ నాయుడు అవకాశం ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. పైగా హై కమాండ్కు మాట మాత్రం కూడా చెప్పకుండా మనోహర్ నాయుడు రాజీనామా చేయడంపై విమర్శలు వచ్చాయి. ఆపై ఇటీవల ఆయన కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మనోహర్ నాయుడు తో పాటు రెండో డివిజన్ కార్పొరేటర్ మరి అంజలి, ఐదో డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్ ను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురిపై క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతోనే అధినేత జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసినట్లు కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది.
Also Read : ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి: జగన్
* పార్టీ ఆవిర్భావం నుంచి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మనోహర్ నాయుడు( Manohar Naidu ) ఆ పార్టీలో పని చేస్తున్నారు. పార్టీలో పలు కీలక పదవుల్లో పనిచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు మేయర్ గా ఆయనకు అవకాశం దక్కింది. అయితే 2024 ఎన్నికల్లో అనూహ్యంగా మనోహర్ నాయుడును చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. అయితే ఇటీవల ఎవరికి చెప్పా పెట్టకుండా గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే మేయర్ పదవికి రాజీనామా చేసిన సమయంలో మనోహర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు దారుణ అవమానం జరిగిందని.. అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
* మేయర్ గా రవీంద్ర
అయితే ఇటీవల పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మనోహర్ నాయుడు పై ఆరోపణలు వచ్చాయి. దీంతోనే ఆయనపై పార్టీ హై కమాండ్ అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. నిజమేనని తేలడంతో చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. అయితే గుంటూరు మేయర్ పదవిని టిడిపి దక్కించుకుంది. కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన కోవెలమూడి రవీంద్ర( kovilamodi Ravindra) మేయర్ గా గెలుపొందారు. ఆయనకు మద్దతుగా 34 మంది ఓటు వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ రెడ్డికి 27 మంది మద్దతు తెలిపారు. దీంతో గుంటూరు మేయర్ పీఠం టిడిపి కూటమికి దక్కింది.