HomeతెలంగాణSunil Narang : సునీల్ నారంగ్ ను ఎవరు ఇబ్బంది పెట్టారు? బాధ్యతలు స్వీకరించిన 24...

Sunil Narang : సునీల్ నారంగ్ ను ఎవరు ఇబ్బంది పెట్టారు? బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే రాజీనామా ఎందుకు?

Sunil Narang : భారీ చిత్రాలకు కూడా పర్సంటేజ్ అనే విధానాన్ని తీసుకురావాలని ఎగ్జిబిటర్లు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. ఈ పద్ధతిని గనక అమలు చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని వారు వాపోతున్నారు. ఈ వివాదం వల్ల సునీల్ నా రంగ్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే నారంగ్ ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ” నాకు సంబంధం లేకపోయినా సింగిల్ థియేటర్స్ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని” సునీల్ తన అంతరంగీకుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇటీవల బంద్ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. దాని వెనుక ఆ నలుగురు ఉన్నారంటూ జరిగిన ప్రచారం కూడా సునీల్ ను కలతకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఆ నలుగురిలో సునీల్ కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. అది ఆయనను తీవ్రంగా బాధపెట్టిందని సమాచారం.. ఆ వ్యాఖ్యలపై దిల్ రాజు, అరవింద్ లాంటి వాళ్లు రోజుల వ్యవధిలో విలేకరుల ముందుకు వచ్చి తమ వాణి వినిపించినప్పటికీ.. సునీల్ మాత్రం సైలెంట్ అయ్యారు.. ఇక ఇటీవల చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం విలేకరుల సమావేశం నిర్వహించింది. అందులో శ్రీధర్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సునీల్ ను తీవ్రంగా వేదనకు గురిచేసాయి.. పెద్ద హీరోలను లక్ష్యంగా చేసుకొని శ్రీధర్ ఆరోపణలు చేశారు. శ్రీధర్ చేసిన వ్యాఖ్యల వెనుక సునీల్ ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీకి తెలియజేశారు.

Also Read : ‘హరి హర వీరమల్లు’ వాయిదా కారణంగా మా పరిస్థితి దయనీయంగా మారింది – తెలుగు ఫిల్మ్ ఛాంబర్

వివాదం ఎక్కడ మొదలైంది అంటే

సునీల్ రాజీనామాకు కారణమైన వివాదం ఏపీలో మొదలైంది. జూన్ 1 నుంచి థియేటర్లను మూసివేస్తామని వార్తలు వచ్చాయి. చిన్న సినిమాలు తక్కువ కాదని.. పెద్ద సినిమాల మాదిరిగానే పర్సంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ వల్ల సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ వివాదం నేపథ్యంలో సినిమా పరిశ్రమలో పనిచేసే పెద్దలు సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా.. ఎవరికి వారుగా దూరం జరిగిపోయారు.. ఈ వివాదం ఏప్రిల్ 19న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలోని అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత సత్యనారాయణ ఈస్ట్ గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కొనసాగుతున్నారు. ఒక సందర్భంలో థియేటర్లను బంద్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన తొలిసారిగా వ్యాఖ్యానించారు. అది కాస్త చినికి చినిగి గాలి వానలాగా మారింది. చివరికి నైజాం దాకా విస్తరించింది.. నైజాం ఏరియాకి గుండెకాయ లాంటి హైదరాబాదులో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ను ఒక వేదిక బతుకు తీసుకొచ్చి చాంబర్ ఆఫ్ కామర్స్ అనేక సందర్భాల్లో చర్చలు జరిపింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ఒకానొక దశలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ మధ్య విపరీతమైన గొడవలు వచ్చాయి. దీని అందరికి కారణం పర్సంటేజ్, రెంట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని.. దానికోసం ఒక కమిటీని నియమిస్తామని చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక ప్రకటన చేసింది. మే 24 లో సమావేశం నిర్వహించి చర్చలు కూడా జరిపింది.. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక లేఖ వచ్చింది. దీంతో మే 25, మే 26న అల్లు అరవింద్, దిల్ రాజు వరుసగా విలేకరుల సమావేశాలు నిర్వహించి తమ వివరణ ఇచ్చుకున్నారు..” ఆ నలుగురిలో మాకు స్థానం లేదు. అసలు అందులో మేము లేము. పవన్ కళ్యాణ్ సినిమా ఎవరు అడ్డుకుంటారు. అడ్డుకునే స్థాయి ఎవరికి ఉంది” అని వారి వ్యాఖ్యానించారు.. అయితే థియేటర్ల నిర్వహణ వ్యయం అంతకంతకు పెరగడం.. ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడం.. ఓటిటికి వెంటనే సినిమాలు వచ్చేయడం వల్ల తమకు నష్టం జరుగుతోందని థియేటర్లో ఓనర్లు చెబుతున్నారు. అయితే థియేటర్ ఓనర్ల సమస్యలు గాలికి వెళ్ళగా.. సినిమా పరిశ్రమలోని పెద్దలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ సమస్యలు 40 రోజులుగా సాగుతున్న వ్యవహారంలో తెరపైకి వచ్చినప్పటికీ.. పరిష్కార మార్గం మాత్రం కాన రాలేదు.. అప్పటికి దిల్ రాజు చెప్పినట్టుగానే.. ఫలు దఫాలుగా జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే అర్ధాంతరంగా ముగిసిపోవడం విశేషం.. థియేటర్ లలో ప్రేక్షకులు సినిమా చూపించేలాగా పరిస్థితులు కనిపించడం.. సినిమాల బడ్జెట్ ను నియంత్రణలో ఉంచడం వంటి చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమవుతుంది. లేకుంటే నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకునేదాకా వస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular