Homeఆంధ్రప్రదేశ్‌Jagan Rappa Rappa Viral Video: 'రప్పా..రప్పా' అంటూ 'పుష్ప' డైలాగ్ కొట్టిన మాజీ సీఎం...

Jagan Rappa Rappa Viral Video: ‘రప్పా..రప్పా’ అంటూ ‘పుష్ప’ డైలాగ్ కొట్టిన మాజీ సీఎం జగన్..వీడియో వైరల్!

Jagan Rappa Rappa Viral Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) నటించిన ‘పుష్ప 2′(Pushpa 2) చిత్రం లోని డైలాగ్స్, మ్యానరిజమ్స్ ప్రభావం కేవలం యూత్ ఆడియన్స్ లోనే కాదు, అన్ని ఏజ్ గ్రూప్ లపై కూడా ఉంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. క్రికెటర్స్ నుండి రాజకీయ నాయకుల వరకు ప్రతీ ఒక్కరికి ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ రోజుకి ఒక్కసారి అయినా ఎదో ఒక సందర్భంలో వాడాల్సిందే. ఇది పుష్ప మొదటి భాగం విడుదలైనప్పటి సంగతి. కానీ ‘పుష్ప 2’ విడుదలయ్యాక ‘తగ్గేదేలే’ డైలాగ్ తో పాటు, ‘రప్పా రప్పా’ డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది. రీసెంట్ మాజీ సీఎం జగన్ పర్యటనలో ఒక అభిమాని జగన్(YS Jagan Mohan Reddy) ప్లకార్డు పై ‘మేము అధికారం లోకి వచ్చిన తర్వాత జాతర లో వేట తలలను నరికినట్టు రప్పా రప్పా నరుకుతాము ఒక్కొక్కడిని’ అని ఉంటుంది.

Also Read: Jagan Sentiment Ring Story: జగన్ పెట్టుకున్న ఆ ‘ఉంగరం’ కథేంటి?

పబ్లిక్ లోకి వచ్చి ఇలాంటి హెచ్చరికలతో కూడిన ప్లకార్డుని పట్టుకొని తిరగడం పై కూటమి ప్రభుత్వం ఫైర్ అయ్యింది. అసలు ఇలాంటి సైకోలను ప్రోత్సహించడానికి మనసు ఎలా వస్తుంది?, కచ్చితంగా ఈ ప్లకార్డుని పట్టుకొని తిరిగిన వాళ్లపై చర్యలు తీసుకుంటాము అంటూ నిన్న నారా లోకేష్ ట్వీట్ వెయ్యడం, నేడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం వంటివి జరిగింది. అయితే ఈ ఘటనపై కాసేపటి క్రితమే మాజీ సీఎం జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ
ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. LED స్క్రీన్ పై తన కార్యకర్త పట్టుకున్న ప్లకార్డు పై ఉన్న దానిని చదవమని తన పక్కన ఉన్నవాళ్లకు చెప్తాడు. అతని చదివిన తర్వాత ‘ఇది సినిమా డైలాగ్ కాదయ్యా..పుష్ప సినిమా డైలాగ్ చెప్పినందుకు కూడా అరెస్ట్ చేస్తారా..?, మనం ప్రజాస్వామ్యం లోనే ఉన్నామా?, పుష్ప డైలాగ్స్ చెప్పినా తప్పే, పుష్ప మ్యానరిజమ్స్ చేసిన తప్పే..ఏంటయ్యా ఇది’ అంటూ జగన్ చెప్పుకొచ్చాడు.

Also Read: Jagan vs Yellow Media War: టీడీపీ, ఎల్లోమీడియాతో యుద్ధం చేస్తున్నాం

జగన్ మాట్లాడిన ఈ మాటలపై అల్లు అర్జున్ అభిమానులు మా అభిమాన హీరో డైలాగ్ ని మాజీ సీఎం వాడుకున్నాడు అంటూ గర్వంగా చెప్పుకుంటూ సోషల్ మీడియా లో తిరుగుతున్నారు, కానీ మాజీ సీఎం అయ్యింది కూడా జగన్ ఇలాంటి వాటిని ప్రోత్సహించడం పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అది సినిమాలోని డైలాగ్ అయ్యుండొచ్చు, కానీ ఎలాంటి సందర్భంలో, ఏ ఉద్దేశ్యంతో అన్నాడో అర్థం చేసుకోకపోతే ఎలా?, ఇదే పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలో టీపీడీ, వైసీపీ పార్టీల కార్యకర్తల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం ఉండేదో అప్పుడే మర్చిపోయారా?, అలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్లకార్డులు పెట్టుకొని తిరిగితే తప్పు అని చెప్పాల్సింది పోయి, సమర్దించడం జగన్ కే చెల్లింది అంటూ మండిపడుతున్నారు. కూటమి నేతలు కూడా జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version