Jagan Quash Petition: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది హైకోర్టు. కొద్ది రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. వైసిపి కార్యకర్త సింగయ్య అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే జగన్ కాన్వాయ్ ఢీకొని ఆయన మృతి చెందాడని పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. పోలీస్ విచారణకు హాజరుకావాలని జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో తన పై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఈరోజు ఆ కేసు విచారణ జరగనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పోలీస్ ఆంక్షలు ఉన్నా సత్తెనపల్లి( Sattenapalli ) నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడి విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఇంతకుముందు జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. దీంతో పోలీసులు కొంత ఆంక్షలు విధించారు. కాన్వాయ్ లో మూడు వాహనాలు ఉండేలా చూసుకోవాలని.. పరిమిత సంఖ్యలో జనాభాతో విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవాలని సూచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి 50కు పైగా వాహనాలతో కాన్వాయిగా వెళ్లారు. దారి పొడవు నా భారీగా జన సమీకరణ జరిగింది. ఈ తరుణంలో సింగయ్య అనే వృద్ధుడు జగన్ కాన్వాయ్ ఢీకొని చనిపోయాడని ప్రచారం సాగింది. కానీ గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడంటూ గుంటూరు పోలీసులు ప్రకటించారు. కానీ ఇంతలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందపడి సింగయ్య మృతి చెందినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్లు మార్చి కేసు దర్యాప్తు ప్రారంభించారు. విచారణకు హాజరు కావాలంటూ జగన్మోహన్ రెడ్డికి నేరుగా నోటీసులు జారీ చేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి నిన్న అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
క్వాష్ పిటిషన్లు దాఖలు
అయితే ఈ కేసులో వాహన డ్రైవర్ రమణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆయన పిఏ నాగేశ్వర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినిని నిందితులుగా చేర్చిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏ పాపం తెలియదని.. రమణ నిర్దోషులుగా ప్రకటించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు( kwash petitions ) దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తప్పకుండా ఈ కేసు విచారణపై స్టే ఇస్తుందన్న ఆశతో వారంతా ఉన్నారు. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
Also Read: Jagan Active Politics: జగన్ ముందున్న ఆప్షన్ అదే
సోషల్ మీడియాలో వారు
మరోవైపు సింగయ్య( singaiya ) మృతి పై రకరకాల చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా కూటమి పార్టీలు వెర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ అన్నట్టు ఉంది. అది ఫేక్ వీడియో అని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వీడియోను క్రియేట్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని అంతటా ఉత్కంఠ కొనసాగుతోంది.