ABN Venkatakrishna Criticism Jagan: పాత్రికేయులు పాత్రికేయుల మాదిరిగానే ఉండాలి. రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులుగా.. నాయకులకు వ్యక్తిగత కార్యదర్శులుగా వ్యవహరిస్తేనే సమాజం నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ జాబితాలో తెలుగులో సుప్రసిద్ధ పాత్రికేయులు ముందు వరుసలో ఉంటారు. అందులో ఏబీఎన్ వెంకటకృష్ణ కూడా ఒకడు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న విమర్శలు అలానే ఉన్నాయి మరి.
Also Read: జగన్ ముందున్న ఆప్షన్ అదే
ఏబీఎన్ అనేది చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందని జగమెరిగిన సత్యమే. కాకపోతే ఇటీవల కాలంలో ఏబీఎన్ మరింత రెచ్చిపోతున్నది. చివరికి టిడిపి అధికారిక సోషల్ మీడియా కూడా ఏబీఎన్ స్థాయిలో పనిచేయలేక పోతోంది. ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే డిబేట్లో కేవలం జగన్మోహన్రెడ్డిని తిట్టిపోవడానికి మాత్రమే నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. సాక్షిలో ఏం జరుగుతోంది.. సాక్షి మాత్రం ఏం చేస్తోంది అనే ప్రశ్న ఇక్కడ ఎదురు కావచ్చు.. సాక్షి అనేది న్యూట్రల్ మీడియా కేటగిరిలో ఉండదు. ఎందుకంటే దాని మాస్టర్ హెడ్ పక్కన వైయస్ బొమ్మ కనిపించినప్పుడే అది ఎలాంటి మీడియానో తెలుగు ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. అలాంటప్పుడు అది ఎలాంటి వార్తలను ప్రసారం చేస్తుంది? ఎలాంటి వార్తలను ప్రచురిస్తుంది? అనే విషయాలపై కొత్తగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఏబీఎన్ అలా కాదు కదా.. ఏబీఎన్ అలాంటి ముద్ర వేసుకోలేదు కదా.. అలాంటప్పుడు ఏబీఎన్ న్యూట్రల్ గానే ఉండాలి కదా.. కానీ న్యూట్రల్ ముసుగులో ఏబీఎన్ ఒక పక్షమైన వార్తలను మాత్రమే ప్రసారం చేయడం, ప్రచురించడం జర్నలిజం ప్రమాణాలకు వ్యతిరేకమని సీనియర్ పాత్రికేయులు అంటున్నారు.
ఇక ఇటీవల జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించిన తర్వాత ఏకంగా అక్కడ మూడు మరణాల చోటుచేసుకున్నాయి. వీటిని సహజంగానే ఏబీఎన్ ప్రశ్నించడం మొదలుపెట్టింది.. ఇక నిన్న వైసిపి కేంద్ర కార్యాలయంలో జగన్ తన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ పట్టిష్టతకు జగన్ కార్యా చరణ రూపొందించారు. అంతేకాదు జనాల్లోకి నాయకులు వెళ్లాలని సూచించారు. దీనికి గానూ ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా కార్యక్రమాలను రూపొందించారు. అయితే ఇవి ఏబీఎన్ వెంకటకృష్ణకు తప్పుగా కనిపించాయి. జగన్ పిలుపునిచ్చిన ఐదు రోజుల కార్యక్రమం ఆయనకు ఐదు రోజుల వ్రతాల లాగా కనిపించింది. జగన్ ఇచ్చిన పిలుపు అనేది పార్టీ కార్యక్రమాలకు సంబంధించి.. ప్రజల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి సంబంధించింది.. ఇందులో వెంకటకృష్ణ తప్పు పట్టాల్సింది ఏముందో అర్థం కావడం లేదు.
వైసిపి అధినేత అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలలో.. ఇప్పుడు అమలు చేస్తున్న ఐదు రోజుల కార్యక్రమం పై ఏబీఎన్ వెంకట కృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాల అమలుపై వెంకటకృష్ణ ఇదే స్థాయిలో విమర్శలు చేయగలరా.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదారి పుష్కరాలు జరిగినప్పుడు చోటు చేసుకున్న మరణాలపై.. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న మరణాలపై ఇదే స్థాయిలో స్పందించగలరా.. వాస్తవానికి మరణాలు జరగాలని.. మరణాలు చోటు చేసుకోవాలని ఏ నాయకుడు కూడా అనుకోడు. కేవలం మరణాల ద్వారానే అధికారంలోకి వస్తామని కలగంటే ఆ నాయకుడికి అంతిమ రోజులు సమీపించినట్టే. ఈ విషయాన్ని మర్చిపోయి ఏబీఎన్ లో “వీకే” తనదైన శైలిలో వ్యాఖ్యానాలు చేయడం జర్నలిజం ప్రమాణాలకు పూర్తి వ్యతిరేకం. ఇక్కడ ఏదో సాక్షి సత్య పూస అని చెప్పడం లేదు. సాక్షిలో గొంతు చించుకొని అరిచే ఈశ్వర్ నికార్సైన జర్నలిస్టు అని చెప్పడం లేదు. కాకపోతే వెంకటకృష్ణ మీద ఈ సమాజానికి ఎంతో కొంత ఆశ ఉంది. నిజాలను చెప్పగలడు అనే నమ్మకం ఉంది. కానీ ఆ ఆశను, నమ్మకాన్ని వెంకటకృష్ణ రోజురోజుకు కోల్పోతున్నాడు. అది ఆయన గమనించినా, గమనించకపోయినా ఇదే యదార్థం.
View this post on Instagram