YS Jagan Mohan Reddy: బెంగళూరులోనే వైసీపీ అధినేత జగన్ నివాసం ఉంటున్నారు. ఆయనకు కేవలం బెంగళూరులో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తాడేపల్లి ప్రాంతంలో.. కడపలో.. హైదరాబాద్ నగరంలో అత్యంత విలాసవంతమైన గృహాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంద్ర భవనాలను తలపించే విధంగా ఉంటాయి.
2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులో ఉన్న ఈ యలహంక ప్యాలెస్ కు మాత్రమే పరిమితమవుతున్నారు. అక్కడినుంచి ఆయన రాజకీయాలు చేస్తున్నారు. అతిధి మాదిరిగా ఆయన బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనకు స్వాగతం పలకడానికి దేవినేని అవినాష్.. అప్పిరెడ్డి సిద్ధంగా ఉంటారు. మల్లాది విష్ణు కు ఎలాగూ తప్పదు.
జగన్ బయటకు వచ్చిన ప్రతిసారి జన సందోహం భారీగా కనిపిస్తోంది. దీని వెనక ఐపాక్ ఉందని.. చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే ఫ్యాన్ పార్టీ అధినేత పర్యటనల వెనక ఐపాక్ టీం పని చేయడం లేదు. జగన్ అంతర్గత వర్గంలోని ఒక బృందం ముందుగానే పర్యటనను ఫిక్స్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత జగన్ ఎవరిని కలవాలి.. ఎవరితో మాట్లాడాలి.. ఎవరు ఆయన వెంట ఉండాలి.. అనేది ఆ బృందం ముందుగానే నిర్ణయిస్తుంది. జగన్ చేతికి స్క్రిప్ట్ అందుతుంది. దానిలో ఉన్న అంశాలను జగన్ మాట్లాడుతూ ఉంటారు. అందులో తప్పులు ఉన్నా సరే.. జగన్ సరిచేసుకునే ప్రయత్నం చేయరు.
సరిగ్గా ఏడాది క్రితం జగన్ జైల్లో ఉన్న ఓ వైసిపి నాయకుడిని పరామర్శించడానికి విజయవాడ వచ్చారు. అప్పుడు ఆ నాయకుడిని పరామర్శి వచ్చిన తర్వాత.. ఓ చిన్న పాప జగన్ ను చూసేందుకు పరితపించిపోయింది.. దీనిని వైసిపి సోషల్ మీడియా తెగ ప్రచారం చేసుకుంది.. అయితే ఆ పాప నాయకుడి కుమార్తె అని తేలింది. ఆ తర్వాత అటువంటి ప్రచారాలకు జగన్ అంతర్గత బృందం దూరంగా ఉన్నప్పటికీ.. మరో ఆలోచనను తెరపైకి తీసుకువచ్చింది. జన సందోహం ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. గతంలో జగన్ పర్యటనలో ఆయన కారు కింద పడి ఒక కార్యకర్త చనిపోయారు. అయినప్పటికీ వైసీపీ నేతలు పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.
త్వరలోనే జగన్ ఆక్వా రైతులను పరామర్శిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనికంటే ముందుగానే వైసిపి నేతలు రంగంలోకి దిగి.. జన సమీకరణ.. ఇతర విషయాల మీద దృష్టి పెట్టారు. జగన్ ను ఎవరు కలవాలి.. ఎవరు మాట్లాడాలి.. ఎవరు ఆయనతో ఉండాలి అనే విషయాల మీద బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఐపాక్ టీం సేవలను ఉపయోగించుకోవడం లేదు. ఒకవేళ అధికారంలో ఉంటే ఐ పాక్ టీం చేసే సిద్ధం సభలను చూడలేక ఏపీ జనం ఇబ్బంది పడేవారు.
