Jagan party leaders warning: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఎదురుగా చూస్తుంటే బలమైన కూటమి. ఆపై కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంది. మొన్ననే బీహార్ ఎన్నికల ఫలితాలతో ఎన్డీఏ దూకుడుగా ఉంది. భవిష్యత్తులో ఏపీలో అటువంటి ఫలితాలు వస్తాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తాను జాగ్రత్త పడకపోతే వచ్చే ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడ ఏమంత పరిస్థితి బాగాలేదని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యానికి గురయ్యారట. ఓ 20 మంది నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీకి అందుబాటులో లేరని గుర్తించారట. వారందరినీ తాడేపల్లికి పిలిపించి పార్టీలో ఉంటారా? నియోజకవర్గ బాధ్యతలు చూస్తారా? లేకుంటే ప్రత్యామ్నాయం చూసుకోమంటారా? అని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన ఇద్దరు నేతలు ఉండడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: జగన్ వస్తే జనం ఉండాల్సిందేనా?
కొడాలి నాని కి హెచ్చరిక..
గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) గుడివాడ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన దారుణ పరాజయం చవిచూశారు. ఊహించని ఓటమి పొందారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కొడాలి నాని కనిపించడం మానేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కు పరిమితం అయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన బొంబాయి లోని పేరు మోసిన ఆసుపత్రిలో చికిత్స పొందారు. అటు నుంచి హైదరాబాద్ వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ గుడివాడలో మాత్రం యాక్టివ్ కావడం లేదు. కేసుల భయంతోనే కొడాలి నాని నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న టాక్ ఉంది. మూడు నెలల తర్వాత యాక్టివ్ అవుతానని చాలా రోజుల కిందట చెప్పారు నాని. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు సైతం గుడివాడలో నిర్వహించడం లేదు. దీనిపైనే జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే జగన్ ప్రశ్నించేసరికి కొడాలి నాని షాక్ కు గురైనట్లు సమాచారం.
వల్లభనేని వంశీ కి క్లియర్ గా..
ఇక వల్లభనేని వంశీ( Vamsi ) సైతం జగన్మోహన్ రెడ్డి పిలిచిన 20 మంది నేతల్లో ఒకరు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చాలా రోజులపాటు వంశీ రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. జైల్లో ఉన్నప్పుడే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గన్నవరంలో యాక్టివ్ అవుతానని చెప్పారు. అయితే కాలం గడుస్తున్నా.. వల్లభనేని వంశీ మాత్రం గన్నవరంలో క్రియాశీలకం కావడం లేదు. అక్కడ పార్టీ కార్యక్రమాలు కూడా జరగడం లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్టివ్ కాకుంటే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకుంటానని కూడా హెచ్చరించారట. ఈ పరిణామాన్ని ఊహించని వల్లభనేని వంశీ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారట.
Also Read: అధికారం, ప్రతిపక్షం.. వైసీపీకి తప్పని కోర్టులు!
అనుచిత ప్రవర్తన..
అయితే జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)నాయకత్వాన్ని సమర్థించే క్రమంలో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ విషయంలో ఈ ఇద్దరు నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు మామూలుగా ఉండేవి కాదు. అయితే ఈ వ్యాఖ్యలే ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పలుచన చేశాయి. వీరి విషయంలో జగన్మోహన్ రెడ్డికి కూడా అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో వీరిద్దరికీ షాక్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?