Dhanush: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు పుష్కలంగా ఉన్నారు… అందుకే తెలుగు నుంచి వచ్చే ప్రతి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. దాని వల్ల బాలీవుడ్ హీరోలు సైతం మన తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు… ఇక మనలో కొంతమంది దర్శకులు కాన్సెప్ట్ బేస్డ్ సినిమా వైపు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి అలాంటి సినిమాలకు న్యాయం చేయగలిగే హీరో ధనుష్ ఒక్కడే అనే ఉద్దేశ్యంతో అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వెంకీ అట్లూరి ‘సార్’ అనే సినిమాతో ధనుష్ కి ఒక మంచి సక్సెస్ ని కట్టబెట్టాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల ‘కుబేర’ సినిమాతో ఈ సంవత్సరం ధనుష్ కి అదిరిపోయే సక్సెస్ ఇచ్చాడు. ఆ బాటలోనే ధనుష్ సైతం తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి తెలుగులో మార్కెట్ ను విపరీతంగా పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక వేణు ఉడుగుల లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం ధనుష్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ధనుష్ కి రెండుసార్లు కథనైతే వినిపించాడు. ఇంకా ఈ కథని ఫైనల్ చేసే పనిలో ధనుష్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇంతకుముందు అజయ్ భూపతి సైతం ధనుష్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నప్పటికి ధనుష్ చాలా బిజీగా ఉండడం వల్ల మహేష్ బాబు వాళ్ళ అన్న కొడుకు అయిన జయకృష్ణ ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నాడు… ధనుష్ ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించగలుగుతాడు. కాబట్టి అతన్ని హీరోగా పెట్టీ సినిమాలు చేయడానికి దర్శకులు ఎదురుచూస్తూ ఉంటారు.
తనతో ఇలాంటి పాత్రనైనా సరే చేయించుకోవచ్చు పాజిటివ్, నెగెటివ్ అనే తేడా లేకుండా ధనుష్ దేనికి అబ్జెక్షన్ చెప్పకుండా అన్ని పాత్రలకు న్యాయం చేయగలుగుతాడు.అందుకే అతను విలక్షణమైన నటుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక మరికొంతమంది కొత్త దర్శకులు సైతం ధనుష్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
ధనుష్ సైతం స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నప్పటికి కమర్షియల్ సినిమాలని కాకుండా డిఫరెంట్ అటెంప్ట్ చేస్తూ ఉంటాడు. కొత్త దర్శకులకు సైతం అవకాశాలు ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అందువల్లే అతను టాప్ పొజిషన్ లోకి వెళ్ళాడని చాలామంది చెబుతూ ఉంటారు…