Jagan Mohan Reddy Public Appearances: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) తన తీరు మార్చుకోవడం లేదు. తాను ఇంటి నుంచి బయటకు వస్తే జనం ఉండాల్సిందేనని చెబుతున్నారు. అది మృతుల కుటుంబాలకు పరామర్శకు వెళ్లినా.. లేకుంటే కోర్టు కేసులకు హాజరైనా.. బల ప్రదర్శన తప్పదు. చివరకు జైల్లో ఉన్న తమ వారిని పరామర్శించేందుకు వెళ్లినా అక్కడ జగన్ మామయ్య అంటూ గుక్క తిప్పుకునే ఏడ్చే సీన్లు ఉండాల్సిందే. ఎందుకంటే తాను ఎలివేట్ కాలేనన్న ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో నిత్యం ఉంటుంది. అయితే తాజాగా ఆయన ఈరోజు హైదరాబాద్ వెళ్లారు. చాలా రోజులకు సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడే జన సమీకరణ స్పష్టంగా కనిపించింది. చక్కటి చిరునవ్వుతో చేతులెత్తి నమస్కరిస్తూ వారిని ఉత్తేజపరిచారు జగన్మోహన్ రెడ్డి. తాను కోర్టుకు వెళుతున్నాం అన్న విషయం కూడా మరిచిపోయి చిరునవ్వుతో.. వెకిలి నవ్వుతో వారిని ఉత్తేజపరిచారు.
Also Read: అధికారం, ప్రతిపక్షం.. వైసీపీకి తప్పని కోర్టులు!
జనం ఉంటేనే నాయకత్వం..
ఎందుకో జగన్మోహన్ రెడ్డి జనాన్ని మరిచిపోలేకపోతున్నారు. జనం లేకపోతే తన నాయకత్వం మరింత బలహీనం అవుతుందని భావిస్తున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే జనం సెంటిమెంటు నుంచి పుట్టిందే ఆయన పార్టీ. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో, అంతులేని సానుభూతి ఉన్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదులు వేశారు జగన్మోహన్ రెడ్డి. అదే సెంటిమెంట్తో గోడలు కట్టారు. అడ్డగోలుగా స్లాబ్ కూడా వేశారు. ఇప్పుడు అందులో నిరంతరాయంగా నివాసం ఉండేందుకు అదే సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అందులో భాగమే తాను ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం జనం కనిపించాలన్న తపన ఆయనది. కానీ జనం దానిని కోరుకోవడం లేదు. జనం ఆలోచన అంతా గడిబిడి వాతావరణం కాదు. చాలా పీస్ ఫుల్ గా ఆలోచిస్తున్నారు ఏపీ ప్రజలు. దానిని గుర్తించలేని స్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.
Also Read: మళ్లీ వారం వారం కోర్టుకు జగన్?!
సింపుల్ గా అధికారపక్షం..
ఒక ప్రభుత్వం ఎలా నడపాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. అయితే ఆయన గొప్పలా పాలించారు అని చెప్పడం లేదు కానీ. జగన్ లా పాలించకపోవడం అసలైన పాలన. ఇప్పుడు చంద్రబాబు( CM Chandrababu) చేస్తోంది అదే. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా హడావిడి లేదు. బయటకు వెళితే జన సమీకరణ లేదు. కేవలం ఒక్కరే చంద్రబాబు వాహనంలో వెళ్తున్నారు. ఒకే ఒక్క గ్రామ ప్రజల మధ్య పథకాలను ప్రారంభిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఒంటరిగానే అడవికి వెళ్తున్నారు. రక్షణగా మందీ మార్బలం లేదు. ప్రభుత్వంలో ఉన్నామన్న దర్పం లేదు. అధికార పార్టీ వారు సింపుల్ గా ఉన్నారు. అధికారం నుంచి ప్రతిపక్షంలో మారిన వారు మాత్రం అదే దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈరోజు జగన్ హైదరాబాదులో అడుగుపెట్టిన మరుక్షణం భాగ్యనగరం ప్రజలకు చుక్కలు కనిపించాయి. అయితే జై కొట్టిన జనానికి ఇది కనిపించలేదు. జై కొట్టిన వారికి కనిపించలేదు. ఎటోచ్చి మిగతా ప్రజలే ఛీ కొడుతున్నారు.