spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan Shoes Price: జగన్ షూస్ ధర అక్షరాల లక్షలు.. సోషల్ మీడియాలో ట్రోల్స్!

Jagan Shoes Price: జగన్ షూస్ ధర అక్షరాల లక్షలు.. సోషల్ మీడియాలో ట్రోల్స్!

Jagan Shoes Price: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) విదేశీ పర్యటనకు సంబంధించిన వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఆయన ట్రెండీ డ్రస్సులతో అలరిస్తూ కనిపించారు. రెండు రోజుల కిందట 15 రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అయితే సాధారణ సంప్రదాయ విస్తరణకు విరుద్ధంగా.. ట్రెండీ లుక్ లో కనిపించారు. జీన్ ప్యాంటు తో పాటు జీన్స్ షర్టుతో.. ఖరీదైన వాచీ తో పాటు షూస్ తో ఒక కొత్త లుక్ లో కనిపించారు జగన్మోహన్ రెడ్డి. ఆయనతో ఫోటోలు దిగేందుకు బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు బారులు తీరారు. వారితో సెల్ఫీలు దిగారు జగన్మోహన్ రెడ్డి. జగన్ న్యూ ట్రెండీ లుక్ తో కూడిన ఫోటోలను, వీడియోలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ధరించిన షూస్ ధరపై రకరకాల ప్రచారం నడుస్తోంది.

* నయా ట్రెండీ లుక్
సాధారణంగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వైట్ కలర్ షర్టుతో పాటు గోధుమ రంగుతో కూడిన ఫ్యాంటును ధరిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా చెప్పులతోనే ఎక్కువగా కనిపిస్తారు. అయితే విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు మాత్రం ట్రెండీ లుక్ తో కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా ట్రెండీ లుక్ తో కూడిన కొత్త జగన్ ఆవిష్కృతమయ్యారు. అయితే ఇప్పుడు ఆయన ధరించిన షూస్ పై విస్తృత ప్రచారం సాగుతోంది. ఆయన ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ జగ్నా షూస్ ధరించారు. వాటి విలువ అక్షరాల లక్ష 85 వేల రూపాయలు అని తెలుస్తోంది. రకరకాల ట్రోల్స్ ప్రారంభం అయ్యాయి.

* చాలా పేద సీఎంనని..
సాధారణంగా జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికలకు ముందు చాలా ఇంటర్వ్యూ లో మాట్లాడారు. తనకు కనీసం ఫోన్ కూడా లేదని చెప్పుకొచ్చారు. తాను ఒక పేద ముఖ్యమంత్రిని అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు 1 లక్ష 85 వేల రూపాయల షూస్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ హయాంలో వాలంటీర్లు మూడు సంవత్సరాలు పనిచేస్తే కానీ ఆ షూస్ వరకు అందుకోలేరని సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేస్తున్నారు కొందరు. పేద సీఎం అంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మరోవైపు ట్రెండీ లుక్ పై సైతం చాలా రకాలుగా ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై సమాధానం చెప్పలేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సతమతం అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular