Jagan Mohan Reddy : ఈమధ్య కాలంలో ఏమైందో ఏమో తెలియడం లేదు కానీ , మాజీ సీఎం జగన్ పెద్ద ట్రోల్ స్టఫ్ గా మారిపోతున్నారు. బయటకి వస్తే చాలు మీమర్స్ కి బోలెడంత కంటెంట్ ఇచ్చి వెళ్తున్నారు. ఆయన సరైన దారిలో వెళ్లడం లేదు , ఇలా వెళ్తే వ్యతిరేకత వస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారో లేరో తెలియదు కానీ , జగన్ ఇదే పద్దతిలో వెళ్తే మాత్రం రాబోయే ఎన్నికల్లో 2024 కంటే దారుణమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే మావిగన్ అంశం లో జగన్ పై సోషల్ మీడియా లో జరుగుతున్నా ట్రోలింగ్ మామూలు రేంజ్ లో లేదు. అంతే కాకుండా సాయి కృష్ణ లాకప్ డెత్ అప్పుడు , అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు మీడియా తో మాట్లాడుతూ ‘ఎదో పాపం చిన్న పిల్లాడు. తెలియక తప్పులు చేశాడు , అంత మాత్రానికే అతనికి ఇలాంటి పరిస్థితి రప్పిస్తారా? ‘ అని మాట్లాడారు.
తీరా చూస్తే ఆ సాయి కృష్ణ అనే వ్యక్తిపై మర్డర్ కేసులు, అఘాయిత్యం కేసులు చాలానే ఉన్నాయి. ఇలాంటి వ్యక్తికి మాజీ సీఎం సపోర్ట్ చేయడమేంటి అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శించారు నెటిజెన్స్. అంతకు ముందు తెనాలి లో గంజాయి కేసులో పట్టుబడ్డ యువకులను పోలీసులు నడిరోడ్డు మీద కూర్చోబెట్టి కొడితే , వాళ్లకు మద్దతుగా వచ్చి ఇదే తరహా కామెంట్స్ చేశారు జగన్. ఇక రీసెంట్ గా సమాజం లో విద్వేషాలు రెచ్చగొట్టే ‘ప్రశ్న రావణ్’ వంటి వారిని అరెస్ట్ చేస్తే , వాళ్లకు మద్దతుగా నిలబడి జనాల్లో ఇంకా కాస్త వ్యతిరేకతని మూటగట్టుకున్నారు జగన్ . ఇక నేడు వైజాగ్ లో పర్యటించిన జగన్ , మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్ట్ చేయడం పై తప్పుబడుతూ కొన్ని కామెంట్స్ చేశారు.
ఆ కామెంట్స్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే సీదిరి అప్పలరాజు కుమారుడు, బైక్ లో వేగంగా వెళ్తూ ఒక మనిషి గుద్ది చంపేశారు. అందుకు అతని పై పోలీసులు మర్డర్ కేసుని నమోదు చేసి అరెస్ట్ చేశారు. నేడు సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించిన జగన్ , మీడియా తో మాట్లాడుతూ ‘సీదిరి అప్పలరాజు మన ప్రభుత్వంలో మత్స్యకారుల మంత్రిగా పని చేశారు. ఈరోజు మత్స్యకారులను చంద్రబాబు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసలు పెడుతుందో సీదిరి అప్పలరాజు కొడుకు సంఘటన ఒక ఉదాహరణ. అతని కొడుక్కి కేవలం 18 ఏళ్ళు మాత్రమే. బైక్ తోలుతూ దురదృష్టం కొద్దీ ఒక వ్యక్తిని గుద్దడంతో అతను చనిపోయాడు. యాక్సిడెంట్ లు జరుగుతూనే ఉంటాయి , చేసింది కరెక్ట్ అని నేను చెప్పను, కానీ అతని మర్డర్ కేసులు పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. ఎంత దారుణమో చూడండి , కోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుబడుతూ సెక్షన్లను మార్పించే పరిస్థితి వచ్చింది’ అంటూ జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
ఇట్టాంటి బుర్ర ఉన్నోడిని
తెలియక ఓసారి ముఖ్యమంత్రిని చేశారు ♂️ pic.twitter.com/dMkgfSSqO3— శ్రీకాంత్ (@yskanth) July 14, 2026
