Jagan ipac team: కల్పితం అనేది.. కొద్దిరోజులే పని చేస్తుంది. ఎంతలా ప్రభావం చూపుతుందో.. అంతలా ఇబ్బంది కూడా పెడుతుంది. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి అదే పరిస్థితి. ఏ ఐ ప్యాక్ టీం ద్వారా రాజకీయాల్లో ప్రభంజన శక్తిగా ఎదిగిందో.. అదే టీం ట్రాప్ లో పడి కిందకు వెళుతుంది కానీ.. కోలుకోవడం లేదు. 2019లో అఖండ విజయం. 2024లో ఘోర అపజయం. ఇప్పుడు ఏకంగా పులివెందులలో సైతం సీన్ సితార్ అయింది. ఐ ప్యాక్ టీం అంటూ వందల మందిని నియమించి రాజకీయాలు చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్, ఫేక్ ప్రచారాలతో నూతన రాజకీయాలను ఆవిష్కరించింది ఐప్యాక్ టీం. దాని ద్వారా విజయాన్ని అందుకునేసరికి జగన్మోహన్ రెడ్డి.. అదో అతీతమైన శక్తిగా భావించారు. దానినే అంటిపెట్టుకొని కొనసాగుతున్నారు.
అంతా కల్పితమే..
ఐప్యాక్ టీం( ipac team ) అంతా నటులు, పాత్రధారులే. అంతా కల్పిత లబ్ధిదారులు, కల్పిత పారిశ్రామికవేత్తలు, ఫేక్ ప్రచారాలు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడకి వెళ్తే అక్కడ వారు ప్రత్యక్షమైపోతారు. తమ పాత్రల్లో నటించి వెళ్ళిపోతారు. మొన్నటికి మొన్న ఓ పరామర్శకు ఓ జైలు వద్దకు వెళ్తే గుక్క పెట్టి ఏడ్చే చిన్న పాప కూడా కల్పితమే. అంతలా వారికి శిక్షణ ఇస్తారు. అయితే కల్పిస్తాలు కొద్దిరోజులే పని చేస్తాయి. ప్రజలను ఈ కల్పితాలతో నమ్మిస్తాం అంతే కుదిరే పని కాదు. అవన్నీ ఇప్పుడు వికటిస్తున్నాయి. వైసిపి ప్రభుత్వ హయాంలో ఐపాక్ టీం సభ్యులు కొందరు ఐటీ పారిశ్రామికవేత్తలుగా, ఐటి ఉద్యోగస్తులుగా రూపం మార్చి మీడియా ముందుకు వచ్చారు. వైసిపి గొప్ప మనసున్న ప్రభుత్వం అని.. జగన్ మంచి హృదయం ఉన్న నేతగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.
Also Read: బ్యాలెట్ పత్రాలలో.. ‘పులివెందుల’ ప్రజల ఆక్రందనలు!
అంతా స్క్రిప్ట్ ప్రకారం..
ఐ ప్యాక్ విధులు ఒకలా ఉండేది కాదు. జగన్( Y S Jagan Mohan Reddy ) పర్యటనలకు వెళితే జన సమీకరణ నుంచి అక్కడ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన నినాదాలు వరకు అంతా ఐప్యాక్ చూసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి బలం ప్రజల్లో ఇంకా తగ్గలేదని ప్రచారం చేస్తుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం.అధికారంలో ఉన్నప్పుడు ఐ ప్యాక్ ని ఎక్కువగా నమ్ముకున్నారు. చివరకు క్షేత్రస్థాయిలో ప్రజలను వదులుకున్నారు. పార్టీ శ్రేణులను చిన్నచూపు చూశారు. తనపై ప్రజల్లో ఎంతటి అవిశ్వాసం ఏర్పడింది అన్న విషయం గుర్తించలేకపోయారు. పోనీ ఓటమితోనైనా గుర్తిస్తారు అనుకుంటే ఇంకా ఐప్యాక్ భ్రమలోనే ఉన్నారు. అవే కల్పితాలను నమ్ముకుంటున్నారు.
ప్యాలెస్ దాటింది మొదలు..
జగన్ ప్రతిపక్షనేతగా ఎవరిని కలిసిన తప్పులేదు. కానీ ఎక్కడికి వెళ్తున్న బలప్రదర్శనలకే దిగుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ గడప దాటి బయట అడుగు పెట్టింది మొదలు తిరిగి ప్యాలెస్ గేటు లోపలికి వెళ్లే వరకు హంగామా అంతా ఐపాక్ దే. సీఎం సీఎం అన్న నినాదాలు కూడా ఐపాడ్ ఆలోచన. ఈ ప్రచారమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవనివ్వడం లేదు. వాస్తవాలను తెలుసుకొనివ్వడం లేదు.