Movie Hit or Flop Analysis: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చాలా గొప్ప సినిమాలను చేయాలనే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంచుకున్న కథల్లో లోపాల వల్ల గాని, ఆయా దర్శకులు ఆ సినిమాను సక్సెస్ ఫుల్ గా డీల్ చేయలేకపోవడం వల్ల గాని సినిమాలు ఫెయిలవుతూ ఉంటాయి. నిజానికి ఒక సినిమా సక్సెస్ అయిందా? ప్లాప్ అయిందా? అనేది మనకు ఎలా తెలుస్తోంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: ‘వార్ 2’ మూవీలో ఎన్టీఆర్ విలనిజం పండలేదా..? దీనికంటే అదే బెటరా..?
ఒక సినిమా సక్సెస్ ని రెండు రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు. సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ ను ఆ సినిమా వసూలు చేసినట్లయితే ఆ సినిమాని కమర్షియల్ గా సక్సెస్ అయినట్టుగా భావిస్తారు. అలా కాకుండా సినిమా ప్రేక్షకుడి యొక్క అభిరుచి కి తగ్గట్టుగా ఉండి వాళ్ళకి విపరీతంగా నచ్చినట్లయితే ఆ సినిమాని సక్సెస్ గా పరిగణిస్తారు. ఈ రెండింటిలో కమర్షియల్ గా సక్సెస్ అయితే సినిమా ప్రాఫిట్ లో ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చి డబ్బులు సరిగ్గా రాకపోతే ఆ సినిమా బడ్జెట్ ఫెయిల్యూర్ గా మారుతోంది. మొత్తానికైతే ఆ సినిమాని సక్సెస్ గానే పరిగణిస్తారు గానీ కమర్షియల్ సక్సెస్ గా భావించరు… ఇక సినిమాకి పెట్టిన బడ్జెట్ కంటే భారీ వసూళ్లను రాబట్టి ప్రేక్షకులకు నచ్చినట్టయితే ఆ సినిమా ను భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా లెక్కిస్తారు.
మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అనేవి చాలా కీలకం…డబ్బులు సంపాదించడం కోసమే సినిమాలను చేస్తూ ఉంటారు. కాబట్టి పెట్టిన పెట్టుబడులకంటే ఎక్కువగా వచ్చినప్పుడే సినిమాని సక్సెస్ గా భావిస్తారు. ప్రొడ్యూసర్ కూడా సేఫ్ జోన్ లో ఉంటాడు.
అందుకే సినిమా ఏది ఏమైనా కూడా భారీ కలెక్షన్స్ రావడమే ఇక్కడ ఎజెండాగా పెట్టుకొని సినిమాలను చేస్తు ఉంటారు. భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టి సినిమాను హిట్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలను తీర్చిదిద్దుతూ ఉంటారు…ఇక ఇప్పటివరకు చాలా సినిమాలు మంచి విజయాలను సాధించిన విషయం మనకు తెలిసిందే.
Also Read: టాలీవుడ్ గుట్టు బయటపెట్టిన అల్లు అరవింద్…
అయితే కొన్ని సినిమాల కంటెంట్ బాగుండి సినిమా ప్రేక్షకులకు నచ్చినప్పటికి ఆ సినిమాకి ఆశించిన మేరకు కలెక్షన్స్ అయితే రావు…దానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో సరైన నటీనటులు లేకపోవడం, దానికి సరైన ప్రమోషన్స్ జరపకపోవడం వంటివి కారణమై ఉంటాయి…