Chandrababu Jail: నన్నెవడూ ఏం చేయలేడు.. ఏం పీక్కుంటారో పీక్కోండి.. నాకు పోలీసులు ఉన్నారు… నాకు ఏసీబీ ఉంది.. నాకు సీఐడీ ఉంది.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది.. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. 14 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. నన్నెవరూ టచ్ చేయలేదు.. ఇదీ మొన్నటి వరకు ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ధీమా. మీ బాబుతోనే కాలేదు.. నివ్వు పిల్ల కుంకవు.. నీతు ఏమైతది… జగన్ విజయంలో రెండు రోజల క్రితం వరకు బాబుకు ఉన్న అభిప్రాయం. కానీ చట్ చేశాడు.. ఏం చేయగలడో చేసి చూపించాడు. పక్కా ఆధారాలతో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును దెబ్బకొట్టాడు ఏపీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. తానంటే ఏమిటో.. ఏం చేయగలడో చూపించాడు. మొత్తానికి చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించి చిప్పకూడా తినిపించాడు. ఇంతటితో అయిపోయిందా అంటే లేదనే చెప్పాలి.
బిజినెస్ మెన్‌గా..
బెంగళూరులో వ్యాపారం చేసుకునే బిజినెస్ మ్యాన్ జగన్.. కడప, పులి వెందులకు అప్పుడప్పుడు వచ్చి వెళ్లే జగన్‌పై 2004 తర్వాత తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పరిటాల రవి హత్య వెనుక వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హస్తం ఉందని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపించారు. దీంతో జగన్ అంటే ఎవరూ అన్న చర్చ అప్పుడు జరిగింది. పరిటాల రవి అంటేనే హడల్ అనుకుంటే.. ఆయననే చంపించిన వ్యక్తి ఎంత మొనగాడో అన్న చర్చ జరిగింది. వైఎస్సార్ తన కొడుకుపై సీబీఐ ఎంక్వయిరీకి కూడా ఆదేశించాడు. దీంతో టీవీల్లో జగన్ ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా చూశాం. ఆయన రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడి పెరిగింది. తర్వాత రాజశేఖరరెడ్డి చొరవతో జగన్ రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే జగన్ కోసం వివేకానందరెడ్డితో రాజీనామా చేయించడం కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చలేదు. దీంతో జగన్‌కు టికెట్ ఇవ్వలేదు. దీంతో 2009 లోక్‌సభ ఎన్నికల్లో కడప నుంచి జగన్‌ను నిలబెట్టాడు వైఎస్సార్. ఇలా జగన్ దృష్టిలో తొలిసారి పడ్డాడు నారా చంద్రబాబు నాయుడు..
వైఎస్సార్ మరణం తర్వాత..
ఇక వైఎస్సార్ మరణం తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. జగన్‌ను జైలుకు పంపడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్ అధిష్టానంతో కుమ్మక్కయ్యాడు. హైకోర్టుకు ఓ లేఖ రాయించి.. అక్రమాస్తుల కేసులో జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించాడు. నాడు చంద్రబాబు పైశాచిక ఆనందం పొందాడు. అంతేకాదు. ఇప్పటికీ నేరగాడు.. అనే ముద్రతో నిందిస్తూనే ఉన్నారు. దీంతో జగన్‌లో కసి మరింత పెరిగింది.
2014 ఎన్నికల్లోనే దెబ్బ కొట్టాలని..
16 నెలల జైల్లో ఉన్న జగన్ బయటకు వచ్చిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాబును దెబ్బకొట్టేందుకు సర్వ శక్తులు ఒడ్డాడు. కానీ సఫలం కాలేదు. 67 సీట్ల వద్ద ఆగిపోయాడు. కానీ పూర్తిగా వైదొలగలేదు. ప్రతిపక్ష నేతగా పరిణతిచెందాడు. రాటుదేలాడు. దీంతో బాబు జగన్‌ను పూర్తిగా అణచివేయాలని సంకల్పించాడు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నాడు. తన పైరవీలతో జగన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని ప్రయత్నించాడు. సీబీఐ కేసులను వేగవంతం చేయించేలా బాబు తనకు కీలక శాఖల్లో ఉన్న పరిచయాలను ఉపయోగించాడు. దీంతో జగన్‌లో బాబును దెబ్బకొట్టాలన్న కసిని పరోక్షంగా బాబే పెంచాడు.
చెప్పాడంటే.. చేస్తాడంతే..
చంద్రబాబు కలలో కూడా ఊహించని విధంగా.. మీడియాకు ఏమాత్రం లీక్ కాని విధంగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణ వేగవంతం చేయించారు. 2018లో బయటకు వచ్చిన ఈ కేసులో ఏ37గా ఉన్న చంద్రబాబును ఏ1గా తీసుకువచ్చేలా ఆధారాలు సేకరించాడు. అరెస్ట్ అవుతాననే సంకేతాలు బాబుకు అందినా.. ఏ కేసులో అనేది మాత్రం తెలియలేదు. కానీ, జగన్ 14 ఏళ్ల కసి.. పగను ఎట్టకేలకు తీర్చుకున్నాడు. నేరం నిరూపించి ముందస్తు స్టే తెచ్చుకునే అవకాశం ఇవ్వకుండా జైలుకు పంపించాడు.
వ్యవస్థలను అడ్డుపెట్టుకుని..
ఇన్నాళ్లూ వ్యవస్థలను అడ్డు పెట్టుకుని, న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులను తనకు అనుకూలంగా మలుచుకుని, స్టేలు తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నాడు చంద్రబాబు. ఎక్కడా తాను చేసిన నేరాలు బయట పడకుండా, కుట్రలు తెలియకుండా కవర్ చేయగలిగారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబును చట్ చేయడానికి పోలీసులు కూడా భయపడిన సందర్భంలో.. జగన్ అనుకున్నది సాధించాడు.