https://oktelugu.com/

AP High Court : హైకోర్టు తరలింపు అంత ఈజీ కాదు… షాకిచ్చిన కేంద్రం

వైసీపీ ఎంపీలకు తెలియంది కాదు. కానీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టామన్న అపఖ్యాతి వైసీపీపై పడుతోంది. కనీసం హైకోర్టు తరలింపుపైనా తమ వాదనలు వినిపిస్తే ప్రజలు గుర్తిస్తారన్న ఆరాటం కనిపిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : July 21, 2023 6:05 pm
    Follow us on

    AP High Court : ఆ ఊహే వేరు.. ఆ మధ్యన ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పే కామెడీ డైలాగు ఇది. రెండో పెళ్లి, సెకెండ్ సెటప్ గురించి చెప్పే క్రమంలో బ్రహ్మి విరహ వేదనతో చెప్పే డైలాగు కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పుడు ఏపీలో జగన్ సర్కారు కూడా అదే ఊహల లోకంలో విహరిస్తోంది. అమరావతి నుంచి హైకోర్టు తరలింపు సాధ్యమా? లేదా? అని తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నా యాక్టింగ్ చేస్తోంది. ఏకంగా కేంద్రాన్నే ప్రశ్నిస్తోంది. అసలు తమ వద్ద అటువంటి అంశమే లేదని.. పెండింగ్ పెట్టేందుకు కూడా అవకాశం లేని ప్రశ్నను అడుగుతున్నారని.. సంబంధిత మంత్రి నిండు పార్లమెంట్ లో ప్రకటించారు. దీంతో  వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యింది.

    పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు.. వైసీపీ ఎంపీ తలారి రంగయ్య ఒక ప్రశ్నను లేవనెత్తారు. అమరావతి నుంచి హైకోర్టు తరలింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని.. అటువంటి అంశం ఏదైనా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందా అని ప్రశ్నించారు. దీనిపై కేంద్రం లిఖితపూర్వకంగా స్పష్టమైన సమాధానమిచ్చింది. తమ వద్ద అటువంటి పెండింగ్ అంశం ఏమీలేదని తేల్చిచెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సమన్వయం చేసుకొని ప్రతిపాదన పంపితే కేంద్రం పరిశీలిస్తుందని న్యాయశాఖ స్పష్టం చేసింది.

    అసలు హైకోర్టును కర్నూలుకి తరలించేందుకు వీలవుతుందా లేదా అన్నదానిపై న్యాయ నిపుణులు తమ వాదనలు వినిపిస్తున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం చూస్తే… హైకోర్టు తరలింపు అంశం అంత తేలిక కాదు. న్యాయపరమైన చిక్కులు, సమస్యలు, సవాళ్లు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్‌ 31(2) ప్రకారం హైకోర్టును అమరావతిలో ఏర్పాటుచేసింది సుప్రీంకోర్టు. హైకోర్టును కర్నూలుకు తరలించాలంటే… ముందు ఈ నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్తది జారీ చెయ్యాలి. ఐతే… ఇలా చెయ్యకూడదని సెక్షన్‌ 31 సూచిస్తోంది. అయితే ఈ విషయం వైసీపీ ఎంపీలకు తెలియంది కాదు. కానీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టామన్న అపఖ్యాతి వైసీపీపై పడుతోంది. కనీసం హైకోర్టు తరలింపుపైనా తమ వాదనలు వినిపిస్తే ప్రజలు గుర్తిస్తారన్న ఆరాటం కనిపిస్తోంది.