Jagan Politics: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) చాలామంది నేతలకు సంకెళ్లు వేశారు. వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యం ఉండదు. అలాగని వేరే పార్టీలో చేరలేరు. అంతలా లాక్ చేశారు. అది ఎలా అంటే ప్రత్యర్థులను తిట్టించడం ద్వారా. అయితే ఇలా తిట్టకపోయిన నేతలంతా వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత బయటకు స్వేచ్ఛగా వెళ్ళిపోయారు. కూటమి పార్టీల్లో నిరభ్యంతరంగా చేరారు. అయితే ఇలా తిట్టించిన నేతల విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉన్నారు. తాను తిట్టమంటే తిట్టారు.. రేపు తనను తిట్టమంటే ఎందుకు తిట్టరు అన్నట్టు ఆయన ఆలోచించారు. అందుకే కొంచెం కాదు బాగా తిట్టండి అంటూ అప్పట్లో ప్రోత్సహించారు. అలా తిట్టిన వారికి ఇప్పుడు రాజకీయ అవకాశాలు లేకుండా పోయాయి. ఒక జోగి రమేష్ టిడిపిలో చేరాలనుకున్నారు. కానీ చీర లేకపోయారు. తమ్మినేని సీతారాం జనసేనలోకి వెళ్లిపోవాలని చూశారు. కానీ వెళ్లలేక పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు వైసీపీలో ఉండలేక.. బయటకు వెళ్లలేక సతమతం అవుతున్నారు.
సీనియర్లపై జూనియర్లకు..
కనీసం స్థానిక సంస్థల్లో పదవులు చేపట్టని వారికి సైతం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఇన్చార్జులుగా అవకాశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది కూడా పార్టీలో సీనియర్ నేతలుగా ఉంటూ.. తనకు అండగా నిలిచి.. ప్రత్యర్ధులు పై తిట్ల దండకం అందుకున్న వారిపైనే కొత్తవారిని తెస్తున్నారు. వైసీపీలో ఉండి స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం విషయంలో అదే జరిగింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తమ్మినేనిని తప్పించి.. ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న చింతాడ రవికుమార్ కు బాధ్యతలు కట్టబెట్టేసారు జగన్మోహన్ రెడ్డి. సీనియర్ నాయకుడిగా తనకు అవమానం జరిగినా.. బయటకు వెళ్లలేని వాతావరణాన్ని సృష్టించారు. దీంతో తమ్మినేని కక్కలేరు… అంతకుమించి మింగలేక పోతున్నారు.
నెల్లూరులో నో ఛాన్స్..
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని ( Anil Kumar Yadav) తీసుకుందాం. ఆయనకు పాపం నెల్లూరులోనే ఉండాలని ఉంది. 2024 ఎన్నికల్లో జగనన్న చెప్పారని నరసారావు పేట వచ్చినట్లు ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. పల్నాడులో సైతం తనదే విజయం అంటూ తనకు అలవాటైన మాటలతో పాటు తిట్లను అందుకున్నారు. అక్కడ ఓడిపోయారు. మళ్లీ తన నెల్లూరు తనకు కావాలని కోరారు. లేదు లేదు నెల్లూరు అవకాశమే లేదు అంటూ తేల్చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేక.. మరో పార్టీ తీసుకోక అనిల్ కుమార్ యాదవ్ పక్క రాష్ట్రంలో వ్యాపారాలకు పరిమితమయ్యారు. ఆయన సైతం వైసీపీలోనే ఉన్నారు కానీ గాలిలో ఉన్నారు.
రజనీ విషయంలో అలా..
మాజీమంత్రి విడదల రజిని( vidadala rajini ) విషయాన్ని తీసుకుందాం. ఎక్కడో టిడిపిలో ద్వితీయ శ్రేణి నాయకురాలిగా ఉన్న ఆమెను తీసుకొచ్చి పార్టీ టికెట్ ఇచ్చారు. చిలకలూరిపేట అభ్యర్థిగా మార్చేశారు. ఎమ్మెల్యే అయిన ఆమెను మంత్రిని చేశారు. దీంతో అధినేత మాటే తనకు శిరోధార్యం అంటూ 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ స్థానానికి వెళ్లారు రజిని. అక్కడ ఓడిపోయేసరికి తిరిగి అక్కడ ఓడిపోయేసరికి తిరిగి చిలకలూరిపేట వచ్చారు. తన పని తాను చేసుకునే క్రమంలో ఇప్పుడు రేపల్లె వెళ్ళమన్నారు. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియడం లేదు. అలాగని వేరే పార్టీలో చేరలేరు కూడా. ఎందుకంటే వేరే పార్టీలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అందుకే జగన్మోహన్ రెడ్డి వీరందరినీ లాక్ చేయగలిగారు తిట్ల ప్రోత్సాహం ద్వారా. అంతకుమించి వీరు చేసిన తప్పులేదు కానీ.. జగన్ ట్రాప్ లో వారు పడ్డారు. జగన్ కోసం రాజకీయాలనే విడిచి పెట్టేయాల్సిన అనివార్య పరిస్థితి వారికి ఎదురైంది.