TTD Laddu issue : చేజేతులా టిడిపి ట్రాప్ లో పడిన జగన్!

ఏపీలో లడ్డు వివాదం పెను ప్రకంపనలు సృష్టించింది. ఎన్నో రకాల ట్విస్టులు, కామెంట్లు, సవాళ్లు నడిచాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అధికార పక్షం ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయగా.. విపక్ష వైసిపి మాత్రం ఆ ట్రాప్ లో పడినట్లు స్పష్టమవుతోంది.

Written By: Dharma, Updated On : September 30, 2024 11:19 am

TTD Laddu issue

Follow us on

TTD Laddu issue :  టీటీడీ లడ్డు వివాదంలో వైసిపి అనవసరంగా కలుగజేసుకుందా? తెలుగుదేశం ట్రాప్ లో పడిందా? ఆ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందా? వైసిపి స్పందించడంతోనే అసలు సమస్య వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీటీడీ లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలు చేసింది టిడిపి. సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించేసరికి వైసీపీ అలర్ట్ అయింది.జగన్ బయటకు వచ్చి మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. అయితే ఇక్కడే ఒక లాజిక్ మిస్ అయింది వైసిపి. టీటీడీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. తనకు తాను నిర్ణయాలు తీసుకునేందుకే ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఐఏఎస్ అధికారులతో సమానమైన వారిని ఈవోలు, జేఈవోలుగా నియమించారు. టీటీడీలో జరిగే ప్రతి నిర్ణయం వారిదే. వారి కనుసన్నల్లోనే అంతా జరుగుతుంది. అయితే టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారం వైసిపి ప్రభుత్వ చర్య అన్నట్టు పరిస్థితిని మార్చేశారు.కేవలం ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా పనిచేసిన వై వి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, నాటి ఈవో ధర్మారెడ్డి స్పందించి ఉంటే బాగుండేది. కానీ వైసీపీ అధినేత జగన్ ఎంటర్ అయ్యారు. అదంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని అర్థం వచ్చేలా వ్యవహరించారు. ఈ విషయంలో టిడిపి ట్రాప్ లో పడ్డారు.

* అది ఆరోపణ మాత్రమే
లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఇది ఆరోపణ మాత్రమే. దీనికి ప్రామాణికమైన నిర్ధారణ అంతవరకు జరగలేదు. గుజరాత్ ల్యాబ్ నిర్ధారించింది అంటూ టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఇదే విషయాన్ని చెప్పారు.కానీ దీనిపై కరుణాకర్ రెడ్డి మాత్రమే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. సత్య ప్రమాణం కూడా చేశారు. వై వి సుబ్బారెడ్డి ఆ స్థాయిలో స్పందించలేదు. ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కనీస స్థాయిలో కూడా స్పందించలేదు. ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు.

* విచారణ సాధారణం
ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని నియమించడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తు బృందంతో సిట్ ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ విచారణ నివేదికలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ విషయంలో వై వి సుబ్బారెడ్డి తొందరపడ్డారు. విజిలెన్స్ విచారణ వద్దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ప్రజల్లో అదోరకమైన అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ కూడా టిడిపి ట్రాప్ లో పడినట్లు స్పష్టమవుతోంది.

* అతిగా స్పందన
మరోవైపు వైసిపి అధినేత జగన్ అతిగా స్పందించారు. జరిగిన ఘటనను ఖండించి.. విచారణను స్వాగతించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ టీటీడీ వ్యవహారాన్ని.. వైసీపీ ప్రభుత్వ వ్యవహారంగా మార్చేశారు. పైగా ఈ వివాదం నడుస్తుండగానే తిరుమల వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇది అగ్నికి ఆజ్యం పోసింది. జగన్ క్రిస్టియానిటీ కూడా బయటపడింది. డిక్లరేషన్ ఇవ్వాల్సి రావడంతోనే జగన్ వెనక్కి తగ్గినట్లు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. టిడిపికి కూడా కావాల్సింది ఇదే. అందుకే ఈ మొత్తం ఎపిసోడ్లో టిడిపి ట్రాప్ లో పడ్డారు జగన్. ఇదే అభిప్రాయం విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తం అవుతోంది.