Jagan Faked Medical Colleges: ఏపీలో( Andhra Pradesh) మెడికల్ కాలేజీల అంశం మరింత వివాదాస్పదం అవుతోంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్ విధానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము సృష్టించిన సంపదను అమ్మేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే మెడికల్ కాలేజీల్లో సామాన్యులకు సీట్లు దక్కవని చెప్పారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను కట్టించామని వైసిపి నేతలు ప్రకటన చేశారు. అయితే దీనిపై టిడిపి కూటమి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు ఇవేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయితే జగన్ హయాంలో మెడికల్ కాలేజీల ప్రకటన వచ్చింది కానీ.. నిర్మాణాలు మాత్రం నోచుకోలేదు. అయితే తాము కట్టిన మెడికల్ కాలేజీలను చూసినవారు చాలా ఆశ్చర్యపోతుంటారని.. ఆ భవనాలను చూసి వెళ్తుంటారని జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనీసం పని జరగకుండా.. పునాదుల స్థాయిలో ఉన్న మెడికల్ కాలేజీ స్థలాలను టిడిపి కూటమి సోషల్ మీడియా హైలెట్ చేస్తోంది.
కేంద్రం నిధులే..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు ప్రకటించడం వాస్తవం. కానీ వాటి నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేసిందే తప్ప.. వైసిపి ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. కానీ జగన్ మాత్రం తమ హయాంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగినట్లు.. అద్భుత కట్టడాలు పూర్తయినట్లు ప్రకటన చేశారు. ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే.. మిగతా జిల్లాల్లో కనీసం పనులు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల భూమిని సేకరించారు కానీ.. నిర్మాణాలు ప్రారంభించలేదు. అయితే ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయాలని సంకల్పించింది. అదే జరిగితే పనులు చాలా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలా పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అవిగో మేము నిర్మాణాలు పూర్తి చేసామంటూ చెప్పుకు రావడం ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీకి మైనస్ గా మారింది.
అడ్డంగా బుక్ అయ్యారు..
మెడికల్ కాలేజీలు( medical colleges) నిర్మాణం పూర్తి చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇది ముమ్మాటికి వాస్తవం కూడా. మరి ఎందుకు అనవసరంగా ఈ మెడికల్ కాలేజీ విషయంలో ఆయన అలా ప్రకటన చేశారో తెలియడం లేదు. అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీ ల వ్యవహారంపై విమర్శలు చేసి అడ్డంగా బుక్కయ్యారు జగన్. అనవసరంగా సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. ఆయన హావభావాలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. మేము కట్టిన భవనాలు చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారని.. అక్కడకు వచ్చి ఆగి చూస్తున్నారని.. ఇలా ఏవేవో వింతగా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు టిడిపి సోషల్ మీడియా నేరుగా మెడికల్ కాలేజీ నిర్మాణాల వద్దకు వెళ్లి ఇది పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంలో అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి బుక్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ రెడ్డి ఊహా ప్రపంచంలో కట్టేసానని చెప్తున్న 17 మెడికల్ కాలేజీల్లో మరొకటి “ఆదోని మెడికల్ కాలేజీ”.
తాడేపల్లి ప్యాలెస్ లో స్పెషల్ గా తయారు చేసిన డ్రీం మెషీన్ ఎక్కితేనే, ఇక్కడ “ఆదోని మెడికల్ కాలేజీ/హాస్పిటల్” కనిపిస్తాయి…
రూ.410.32 కోట్లతో పూర్తి చేయాల్సిన ఈ మెడికల్ కాలేజీ కోసం,… pic.twitter.com/lfTGYsHF19— Telugu Desam Party (@JaiTDP) September 9, 2025
తన ఊహా ప్రపంచంలో, జగన్ తాను కట్టేసానని చెప్తున్న 17 మెడికల్ కాలేజీల్లో, కట్టిన మదనపల్లె మెడికల్ కాలేజీ ఇదే..
సొట్టబడిన నేం బోర్డు, భూమి మట్టంలో పోసిన కూసింత కాంక్రీట్ తప్ప అక్కడ ఏమీ లేదు..జగన్ ఊహా ప్రపంచంలో మాత్రం అక్కడ కాలేజీ ఉంది, స్టూడెంట్స్ చదువుతున్నారు, డాక్టర్లు ఉన్నారు,… pic.twitter.com/xfjzPZf0kS
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2025
నేను 17 మెడికల్ కాలేజీలు కట్టేసాను అని చెప్పుకుంటున్న జగన్, కట్టేసిన “పెనుకొండ మెడికల్ కాలేజీ” ఇది..
ఈ పిల్లర్ల మీద కూర్చుని మెడిసిన్ చదవాలా ? లేక ఆ రాడ్ల మీద పడుకుని వైద్యం తీసుకోవాలా ? @ysjagan #JaganFakedMedicalColleges#PsychoFekuJagan#AndhraPradesh pic.twitter.com/a013IaW34B
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2025
నేను కట్టేసా.. నేను ప్రారంభించేసా అని ఊహల్లో విహరిస్తూ, జగన్ కట్టేసిన “అమలాపురం మెడికల్ కాలేజీ” ఇదే..
ఇక్కడ కాలేజీ ఎక్కడ ఉందో, హాస్పిటల్ ఎక్కడ ఉందో, జగన్ ఒక్కడికే తెలుసు..
ఇలా ప్రజలని మభ్య పెట్టి ఫేక్ రాజకీయం చేస్తే, ప్రజలు చూస్తూ ఉంటారా ?#JaganFakedMedicalColleges… pic.twitter.com/FMDeCmkFQD— Telugu Desam Party (@JaiTDP) September 9, 2025
ఇదే జగన్ కట్టానని చెప్తున్న “బాపట్ల మెడికల్ కాలేజీ”..
బిల్డింగులు ఎక్కడ అయ్యా అని అడిగితే, ఫేక్ సాక్షిలో VFX గ్రాఫిక్స్ చూపిస్తారు.. ప్రజలని వెర్రి వాళ్ళని చేస్తారు.
జగన్ మాయా ప్రపంచంలో కట్టిన 17 మెడికల్ కాలేజీల కధల్లో, ఈ “బాపట్ల మెడికల్ కాలేజీ” మరో మాయ..
జగన్ చేసే ఫేక్ రాజకీయం… pic.twitter.com/3XYidZ05Z9— Telugu Desam Party (@JaiTDP) September 9, 2025