YSR Congress Damage Control Strategy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడిన డ్యామేజ్ కంట్రోల్ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు సమాచారం. భారీ అస్త్రంతో ఆయన ఇద్దరు నేతలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు ఉండవల్లి అరుణ్ కుమార్ కాగా.. మరొకరు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. మొన్న మధ్యన అంబటి రాంబాబు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా ఉండవల్లి అరుణ్ కుమార్ పరామర్శించారు. నెయ్యి కల్తీ ఘటనపై ఏకసభ్య కమిషన్ ను ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కమిటీని నిలిపివేయాలని కోరుతూ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తద్వారా తామిద్దరం జగన్ పక్షమేనని సంకేతాలు పంపించారు.
Also Read: సైలెంట్‌గా కేసీఆర్ ఆపరేషన్!
* డామేజ్ కంట్రోల్ కోసం..
నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై భారీ అపవాదు వచ్చి పడింది. జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. ఇప్పటికే సిట్ కల్తీ జరిగిందని తేల్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై హిందూ సమాజం చాలా ఆగ్రహంగా ఉంది. ఇటువంటి సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పాస్టర్ ప్రవీణ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు ఒక ప్రచారం నడుస్తోంది. మరోవైపు రాజధాని అమరావతి విషయంలో సుబ్రహ్మణ్యస్వామిని జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దించినట్లు ఒక వాదన వినిపిస్తోంది.
* పాస్టర్ ప్రవీణ్ కేసు..
పాస్టర్ ప్రవీణ్( pastor praveen ) అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే ఆయనది ప్రమాదం అని ఏపీ పోలీసులు తేల్చారు. అయితే ఇప్పుడు అదే కేసును తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అమరావతి రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు పెట్టేవారు అప్పట్లో. అయితే ఇటీవల ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కోర్టుకు హాజరుకావాలని ఆళ్ళ రామకృష్ణారెడ్డికి నోటీసుల అందాయి. అయితే ఆయన హాజరు కాలేదు. పైగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని వెనుక సుబ్రహ్మణ్యస్వామి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.. ఒకటి అమరావతి, రెండు ఫాస్టర్ ప్రవీణ్ కేసుల ద్వారా ఆ ఇద్దరు నేతలు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడేందుకు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.