Jagan Convoy Accident Video: రాజకీయ నేతల( political leaders) పట్ల కొందరు విపరీతంగా అభిమానం పెంచుకుంటారు. వారికోసం పరితపిస్తుంటారు. వారిని చూడగానే పూనకాలు వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. వారి ప్రాపకం కోసం పిచ్చిగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలానే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు చెంగయ్య అనే వైసీపీ కార్యకర్త. మొన్నటికి మొన్న జగన్ సత్తెనపల్లి పర్యటనలో అపశృతి జరిగిన సంగతి తెలిసిందే. జగన్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొట్టడంతో చెంగయ్య అనే వృద్ధుడు మృతి చెందాడని అంతా భావించారు. అయితే అటువంటిదేమీ లేదని.. గుర్తుతెలియని వాహనం ఢీకొని చెంగయ్య మృతి చెందాడని గుంటూరు ఎస్పీ ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద ఓ మనిషి నలిగిపోయినట్లు కనిపించింది. దీంతో అది చెంగయ్య అని తెగ ప్రచారం నడుస్తోంది.
Also Read: Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు…ఎందుకంటే
విగ్రహ ఆవిష్కరణకు వెళ్తుండగా..
ఏడాది కిందట చనిపోయిన ఓ కార్యకర్త విగ్రహ ఆవిష్కరణకు సత్తెనపల్లి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). అయితే జగన్ పర్యటనల్లో శాంతిభద్రతలు విఘాతం కలుగుతున్నాయని భావించి పోలీసులు కొన్ని రకాల ఆంక్షలు విధించారు. పరిమిత వాహనాలతో పాటు 100 మందితో విగ్రహ ఆవిష్కరణ చేసుకోవాలని సూచించారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశాయి. దాదాపు 6 గంటల పాటు ఆలస్యంగా ప్రారంభమైన జగన్ పర్యటన రెండు కిలోమీటర్ల మేర సాగడానికి.. దాదాపు 6 గంటలకు పైగా పట్టింది. అయితే అదే రోజు గుంటూరు జిల్లా పరిధిలో చంగయ్య అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీ కొట్టి ఆయన మృతి చెందాడని రోజంతా ప్రచారం నడిచింది. అయితే ఆరోజు సాయంత్రానికి గుంటూరు ఎస్పీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. చెంగయ్య గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి చనిపోయారని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. దీంతో ఈ వివాదం అంతటితో సద్దుమణిగింది అని అంతా భావించారు. కానీ సమీప ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులకు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
షాకింగ్ వీడియో
ప్రాణాలు తీస్తున్న పిచ్చి అభిమానం
ఇటీవల జగన్ సత్తెనపల్లి పర్యటనలో రోడ్డు సింగయ్య అనే వ్యక్తి మృతి
జగన్ వాహనం కింద పడ్డ ఓ వ్యక్తి
జగన్ కాన్వాయ్ వాహనం కాకుండా వేరే వాహనం తగిలి ప్రమాదంలో సింగయ్య చనిపోయాడు అని తెలిపిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ https://t.co/fQPb9RaQCu pic.twitter.com/onARqnCPiw
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2025
ఆరోజు జరిగింది అదే..
ప్రధాన రహదారి క్రాసింగ్ వద్ద జగన్ కాన్వాయ్( convoy ) వెళ్తోంది. భారీగా జనాలు గుమిగూడారు. ఈ క్రమంలో ఓ వృద్ధుడు జగన్ ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద పడిపోయాడు. పక్కనే ఉన్న వైసీపీ కార్యకర్తలు కేకలు వేసిన ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర గాయాల పాలైన వృద్ధుడును పక్కకు లాగి సఫర్యలు చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సమీప ప్రాంతాల్లో సిసి ఫుటేజీలను పరిశీలించారు. అయితే జగన్ ప్రయాణించే వాహనం కిందపడి నలిగిపోయిన వ్యక్తి చెంగయ్య అని తేలింది. మరోవైపు ఆ సమయంలో అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు విచారించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీశారు. అయితే వృద్ధుడు చంగయ్య జగన్ ప్రయాణించే వాహనం కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడని.. కేకలు వేసినా వాహనం ఆపలేదని సదరు వైసీపీ కార్యకర్తలు పోలీసు విచారణలో తెలిపినట్లు సమాచారం. మొత్తానికైతే జగన్ వాహనం కిందపడి చెంగయ్య మృతి చెందడం రాజకీయ దుమారానికి దారి తీసే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. అయితే అభిమానం అనే మాట మూల్యం చెల్లించుకోవడం అంటే చెంగయ్యను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.