Tollywood vs Kollywood Directors: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు దర్శకుల హవా ఎక్కువగా నడుస్తోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసే సినిమాలను తీయడంలో మన దర్శకులను మించిన వారు మరెవరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ముఖ్యంగా తమిళ్ సినిమా హీరోలకి మన దర్శకులు సూపర్ సక్సెస్ లను సాధించిపెడితే, మన హీరోలకి మాత్రం తమిళ్ దర్శకులు భారీ డిజాస్టర్ లను కట్టబెట్టారు… తమిళ్ హీరోలకు మన దర్శకులు అందించిన విజయాలు ఏంటి? మన హీరోలకు తమిళ డైరెక్టర్ అందించిన డిజాస్టర్స్ ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి తెలుగులో చాలా రోజుల నుంచి మంచి మార్కెట్ అయితే ఉంది. వాళ్లు తమ సినిమాలని తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ లను సాధించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే గత కొన్ని రోజుల నుంచి తమిళ హీరోలు మన తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
Also Read: Tollywood : టాలీవుడ్ కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు..?
కమల్ హాసన్
ఇండియాలో ఉన్న అతికొద్ది మంది మంచి నటుల్లో కమల్ హాసన్ (Kamal Hasan) ఒకరు. ఆయనను ఆ స్థాయిలో నిలబెట్టిన దర్శకులలో కే విశ్వనాథ్ ఒకరు. ఆయన చేసిన స్వాతి ముత్యం, సాగర సంగమం, శుభ సంకల్పం లాంటి సినిమాలు మొదటి స్థానం ఉండటం విశేషం…ఈ మూవీస్ తో సక్సెస్ రావడమే కాకుండా చాలా అవార్డులను కూడా అందుకున్నాడు… ఒకరకం గా కమల్ లో ఉన్న పూర్తిస్థాయి నటుడిని బయటికి తీసింది కూడా విశ్వనాథ్ గారే కావడం విశేషం…
ధనుష్
వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్షన్లో ధనుష్ (Dhanush) చేసిన సార్ (Sir) సినిమా తనకు నటుడిగా చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా తనకు కెరియర్ లోనే భారీ సక్సెస్ ని కట్టబెట్టింది…
దాంతో ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘కుబేర’ (Kubera) సినిమా కూడా రీసెంట్ గా రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతుంది…
Also Read: Childhood Photo : కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్.. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా..
దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్ లాంటి యాంగ్ హీరో సైతం ప్రస్తుతం తెలుగులో చాలా మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో చేసిన ‘ సీతారామం ‘ (Seetha Ramam) సినిమాతో హీరోగా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా తన నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలను కూడా అందుకున్నాడు. ఇక ఆ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన లక్కీ భాస్కర్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా నచ్చింది. ఈ సినిమాతో ఆయన తెలుగులో స్టార్ హీరోల రేంజ్ కి వెళ్ళిపోయాడనే చెప్పాలి…
విజయ్
తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ కి సైతం వంశీ పైడిపల్లి వారసుడు సినిమాతో ఒక మంచి సక్సెస్ ని అందించాడు…
మన దర్శకులు వాళ్లకు సూపర్ సక్సులు అందిస్తుంటే వాళ్ల దర్శకులు మన హీరోలతో చేసిన సినిమాలు రిజిస్టర్ గా మారాయి అవేంటో ఒకసారి మనం చూద్దాం…
తమిళ స్టార్ డైరెక్టర్ అయిన కె ఎస్ రవి కుమార్ చౌదరి (K S Ravi Kumar Choudary) దర్శకత్వం లో చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన స్నేహంకోసం (Sneham Kosam) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు….
మురుగదాస్
టాలెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మురుగదాస్ మహేష్ బాబు(మహేeష్ Babu) తో చేసిన స్పైడర్(Spyder) సినిమాతో భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. ఈ సినిమాతో మహేష్ బాబు కెరీర్ కూడా చాలావరకు డౌన్ ఫాల్ అయిందనే చెప్పాలి…
లింగుస్వామి
తెలుగులో ఎనర్జిటిక్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ పోతినేని(Ram Pothineni)… ఈయన హీరోగా లింగు స్వామి (Linguswamy) దర్శకత్వంలో వచ్చిన వారియర్(Warrior) సినిమా డిజాస్టర్ ను మూటగట్టుకుంది. అప్పటివరకు రామ్ కి చాలా మంచి మార్కెట్ అయితే ఉండేది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ భారీగా తగ్గిపోయింది…
Also Read: Viral: నేటి తారల ‘సోషల్’ వీకెండ్ లుక్స్
వెంకట్ ప్రభు
నాగచైతన్య తో చేసిన కస్టడీ సినిమాతో ఆయనకి డిజాస్టర్ ని కట్టబెట్టాడు. ఈ మూవీ డిజాస్టర్ తో నాగ చైతన్య చాలావరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి…
రామ్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ (Game Changer) సినిమా ఈ ఇయర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…
ఎస్ జే సూర్య
పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య చేసిన పులి సినిమా డిజాస్టర్ ని మూట గట్టుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విమర్శలు అయితే వచ్చాయి…