Nandamuri Balakrishna Quit Hindupur: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది ప్రముఖుల నియోజకవర్గాల మార్పు అనివార్యం అయ్యేలా ఉంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం మారుతారని ప్రచారం జరుగుతోంది. అవసరం అనుకుంటే తెలంగాణలో బాలకృష్ణ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య బాబు హిందూపురం అడ్డా అంటూ కార్యకర్తలు నినాదాలు చేయగా.. ఒక్క హిందూపురం ఏంటయ్యా.. తెలంగాణ, ఏపీలో ఏ నియోజకవర్గం నుంచైనా గెలుస్తానంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ కు లోకేష్ షాక్!
సినిమాల్లో నటిస్తూనే..
తెలుగు చిత్ర పరిశ్రమలో( తనకంటూ గుర్తింపు సాధించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటివరకు 109 చిత్రాల్లో నటించారు. ఇంకా నటిస్తూనే ఉన్నారు. ఒకవైపు సినిమాల్లో ఉంటూనే రాజకీయ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నారు. 2014లో తొలిసారిగా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో సైతం రెండోసారి పోటీ చేసి గెలిచారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించి ఫ్యాక్టరీ కొట్టారు నందమూరి బాలకృష్ణ. అయితే ఈసారి నందమూరి బాలకృష్ణ హిందూపురం ను విడిచిపెడతారని ప్రచారం నడుస్తోంది. ఆయన స్థానంలో భార్య వసుంధర హిందూపురం నుంచి పోటీకి దిగుతారని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆమె తరచూ హిందూపురం నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం..చిరంజీవి కూడా ఇలా చేసి ఉండడేమో!
జాతీయ రాజకీయాల్లోకి..
మరోవైపు నందమూరి బాలకృష్ణ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. మొన్న ఆ మధ్యన పార్లమెంట్ కార్యాలయం వద్ద హల్చల్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర పెద్దలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తప్పకుండా పార్లమెంటుకు వస్తానని సంచలన ప్రకటన చేశారు. తద్వారా కేంద్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపనలో సైతం అదే తరహా వ్యాఖ్యలు చేశారు. దీంతో బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గానికి గుడ్ బై చెప్పడం ఖాయమన్న విశ్లేషణలు, వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.