Jagan
Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే సిఐడి ప్రాథమిక స్థాయి విచారణ చేపట్టింది. అటు తరువాత ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటయింది. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం విచారణను కొనసాగించింది. దాదాపు 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యంతో చాలామంది అనారోగ్యానికి గురైనట్లు నిపుణుల కమిటీ సంచలన నివేదిక ఇచ్చింది. కాలేయంతో పాటు నాడీ సంబంధిత వ్యాధులు భారీగా పెరిగాయని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే మద్యం కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి ఎంట్రీ ఇచ్చింది. సిట్ దర్యాప్తు నివేదిక అనుగుణంగా విచారణ చేపట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
* నిపుణుల విచారణలో సంచలన అంశాలు..
మద్యం కుంభకోణం పై( liquor scam) ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో నిపుణుల కమిటీ సైతం అప్పటి మద్యంతో జరిగిన అనారోగ్య అనర్థాలను గుర్తించే పనిలో పడింది. అయితే నిపుణుల విచారణలో సంచలన అంశాలు బయటపడ్డాయి. 2019 నూతన మద్యం పాలసీ అందుబాటులోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. అయితే ఈ దుకాణాల్లో లభించిన మద్యం తాగిన వారిలో కాలేయవ్యాధులు రెట్టింపు అయ్యాయి. సాధారణంగా మద్యం తాగితే కాలేయ వ్యాధులు సంక్రమిస్తుంటాయి. 2014 నుంచి 2019 మధ్య 14 వేల వరకు ఉన్న మద్యపాన సంబంధిత కాలేయ వ్యాధులు.. 2019 తర్వాత రెట్టింపు అయ్యాయి. రికార్డు స్థాయిలో 29,369 కి పెరిగాయి. ఐదేళ్లతో పోలిస్తే ఏకంగా 100% రుగ్మతలు పెరిగాయి. నాడీ సంబంధిత వ్యాధుల పరిస్థితి కూడా అలానే ఉంది. ఏకంగా నాడీ వ్యాధులు 892 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం తాగిన వారిలో 2014 నుంచి 2019 మధ్య నాడి సంబంధిత వ్యాధిగ్రస్తులు 1276 మంది ఉంటే.. 2019 తర్వాత ఆ సంఖ్య 12,663 కు చేరడం విస్మయ పరుస్తోంది.
* రుగ్మతలకు అవే కారణం..
కిడ్నీ వ్యాధులు, మానసిక రుగ్మతలకు అప్పటి మద్యం కారణమని తాజా విచారణలో వెల్లడయ్యింది. 2019 అక్టోబర్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రారంభించింది. అయితే అంతకుముందు అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉండేవి. కానీ దేశంలో ఎక్కడా చూడని, వినని మద్యం బ్రాండ్లు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించేవి. అప్పట్లో నాసిరకం మద్యం అమ్మకాలపై విపక్షాలు గట్టిగానే ప్రశ్నించాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మద్యం డిస్టలరీలన్నీ వైయస్సార్సీపీ నేతల వేనని ఆరోపణలు ఉన్నాయి. ఏ కంపెనీ కమిషన్లు ఎక్కువగా ముట్టచెబితే వాటి సరఫరాకు అప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి నేతృత్వంలో అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు హైదరాబాదులో ఈ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మద్యం సీసా పై 50 రూపాయల కు తగ్గకుండా కమీషన్లు దండుకున్నారని సిట్ దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. నాసిరకం మద్యం సరఫరా చేసి.. ప్రజారోగ్యానికి భంగం వాటిల్లినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. చాలా రుగ్మతలతో ప్రజలు చనిపోయారు. కానీ అవన్నీ నాసిరకం మద్యం వల్లేనని ఆరోపణలు వచ్చినా.. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా స్పందించలేదు.
* సిట్ విచారణ అంశాలను పరిగణలోకి తీసుకొని..
ఇప్పటివరకు ప్రత్యేక దర్యాప్తు బృందం ( special investigation team )సిట్ విచారణ చేపట్టింది. విచారణలో తేలిన అంశాలను.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈడి మరోసారి దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా దర్యాప్తులో పలు అంశాలపై దృష్టి పెట్టింది. అప్పట్లో జాతీయ ప్రీమియం బ్రాండ్లను పక్కనపెట్టి.. వైయస్సార్ కాంగ్రెస్ నేతలకు చెందిన కంపెనీల నుంచి, కమీషన్లు ఎక్కువగా ఇచ్చిన సంస్థల నుంచి మద్యం ఆర్డర్ చేసినట్లు పక్కా ఆధారాలు సేకరించినట్లు సమాచారం. జాతీయస్థాయిలో పేరుమోసిన ప్రీవియం మద్యం బ్రాండ్లను పక్కనపెట్టి.. ఆంధ్ర గోల్డ్ విస్కీ, గుడ్డు ఫ్రెండ్స్ విస్కీ, డేర్ హౌస్ బ్రాందీ, ఛాంపియన్ స్పెషల్ విస్కీ, హాట్స్ డిజైర్ విస్కీ వంటి కొత్త, స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ప్రాణులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేశారని తాజాగా తేలింది. కేవలం నాసిరకం మద్యంతో ఏపీ ప్రజల ఆరోగ్యానికి భంగం వాటిల్లిందని తెలియడం సంచలనం కలుగుతోంది. ఈడి ఎంట్రీ తో మద్యం కుంభకోణం లో అసలు సిసలైన నిజాలు వెలుగు చూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
100% Increase In Alcohol-Related Liver Diseases During Jagan Govt In Andhra, Panel Findshttps://t.co/GjTPQohMrS
— ABP LIVE (@abplive) May 11, 2025
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Jagan cheap liquor andhra pradesh report