Jagan arrest : మద్యం కుంభకోణం(liquer scame) కేసులో జగన్ అరెస్టు తప్పదా? వచ్చే నెల 10లోపు అరెస్టు చేస్తారా? ఆయన సన్నిహితుడు అదే విషయం చెబుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణం కుదిపేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమతించింది. రూ.3,500 కోట్లు హవాలా రూపంలో మద్యం కుంభకోణం ధనాన్ని పక్కదారి పట్టించారని ప్రాథమిక నిర్థారణకు వచ్చింది. వెనువెంటనే ప్రత్యేక దర్యాప్తు కోసం సిట్ ను ఎంపిక చేసింది. అప్పటి నుంచి విచారణ మరింత వేగవంతం అయ్యింది. అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. తొలుత సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్టయ్యారు. అటు తరువాత జగన్ జమానాలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా పనిచేసిన ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్టయ్యారు. అటు తరువాత జగన్ సన్నిహితుడు, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సైతం అరెస్టు చేశారు. ఈ అరెస్టుల తీరు చూస్తుంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అని టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి తరుణంలో జగన్ స్పందించారు. విజయవాడలో ఉంటాను తనను అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు.
కేసు మరింత వేగవంతం..
అయితే ఇప్పుడు మద్యం కుంభకోణం విషయంలో మరింత వేగం పెంచాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని(YS jaganmohan reddy) అరెస్టు చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో చర్చించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో జగన్ ఒకప్పటి సన్నిహితుడు విజయసాయిరెడ్డి సన్నిహితుల వద్ద సంచలన విషయం వెల్లడించినట్టు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు తప్పదని చెప్పినట్టు సమాచారం. ఎప్పుడు అరెస్టు చేస్తారో కూడా చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డిని వచ్చే నెల 10 తేదీలోపు అరెస్టు చేస్తారని మాత్రం తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే తనకు కెలకొద్దు అంటూ జగన్ కోటరీకి గట్టిగానే చెప్పారు విజయసాయిరెడ్డి. కానీ వైసీపీ సోషల్ మీడియా అదే పనిగా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసుకోవడంతో జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో ఆయన సైతం నోరుజారినట్టు ప్రచారం ఉంది.
Also Read : సంచలనం.. ఏపీ సీఎం జగన్ కజిన్ అరెస్ట్.. అసలేం జరిగింది?
విజయసాయిరెడ్డి కీలక ఆధారాలు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress party)జనవరి నెలలో గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. అయితే మద్యలో మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో ఏ5 నిందితుడిగా విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే ఈ మద్యం కుంభకోణంతో తనకెటువంటి సంబంధం లేదని తేల్చారు విజయసాయిరెడ్డి. ఈ కుంభకోణానికి వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుడిగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి కర్త, కర్మ, క్రియ అంటూ తేల్చిచెప్పారు. దీంతో సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని వలవేసి పట్టుకున్నారు. అయితే విజయసాయిరెడ్డి బండారం బయటపెడతాను అంటూ రాజ్ కసిరెడ్డి హెచ్చరించారు. అటు తరువాత సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మొత్తం ఆధారాలు ఇచ్చారు. దీంతో అరెస్టులపర్వం ప్రారంభమైంది. దీంతో తదుపరి అరెస్టు జగన్ దేనని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో మీడియా ముందుకు వచ్చారు జగన్. చంద్రబాబుకు అమ్ముడుపోయిన వ్యక్తిగా విజయసాయిరెడ్డిని అభివర్ణించారు. దీంతో విజయసాయిరెడ్డి అప్పటివరకూ జగన్ పై మాట్లాడ లేదు. కానీ జగన్ నుంచి విమర్శలు పెరగడంతో మద్యం స్కాంలో జగన్ అరెస్టుపై ఏకంగా విజయసాయిరెడ్డి సన్నిహితుల వద్ద మాట్లాడినట్టు సమాచారం.వచ్చే నెల 10లోపు జగన్ అరెస్టు ఉంటుందని.. అందుకు కూటమి ప్రభుత్వం ఫిక్స్ అయిపోయిందని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.
ఆ ఆలోచనలో కూటమి..
అయితే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్టు చేసి జగన్ సర్కారు తప్పుచేసింది. దీంతో ప్రజల్లో చంద్రబాబు పట్ల సానుభూతి వ్యక్తమైంది. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణం విషయంలో అలా కాదు. ముందుగా ఈ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులను పట్టుకున్నారు. వారి వద్ద కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. చివరకు జగన్ చుట్టూ ఉచ్చు బిగించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తిస్థాయి వివరాలు ప్రజల ముందు ఉంచనున్నారు. తద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో ప్రభుత్వానికి వచ్చే చిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రజల్లో సానుభూతి దక్కకుండా పావులు కదపాలని చూస్తోంది. చూడాలి మరీ ప్రభుత్వం ప్రయత్నాలు ఎంతవరకూ వర్కౌట్ అవుతాయో…