https://oktelugu.com/

Jagan Cousin Arrest: సంచలనం.. ఏపీ సీఎం జగన్ కజిన్ అరెస్ట్.. అసలేం జరిగింది?

Jagan cousin arrest: ఆయన స్వయానా సీఎం జగన్ కు కజిన్. పైగా జగన్ సొంత జిల్లా, నియోజకవర్గం పులివెందుల వాసి. అయితే జగన్ అధికారాన్ని ఉపయోగించుకొని ఈ కజిన్ ఆమ్యామ్మాలకు ఎగబడ్డారు. స్వయంగా సీఎం జగన్ కుటుంబానికి దగ్గర బంధువైన వైఎస్ కొండారెడ్డి కాంట్రాక్టర్లను కమీషన్ అడిగి తాజాగా అడ్డంగా బుక్ అయ్యాడు. చివరకు ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం పెద్దది అయ్యి ఈయన అరెస్ట్ కు దారితీసింది. జాతీయ స్థాయిలో సీఎం జగన్ కు అప్రతిష్ట […]

Written By: , Updated On : May 10, 2022 / 10:50 PM IST
Follow us on

Jagan cousin arrest: ఆయన స్వయానా సీఎం జగన్ కు కజిన్. పైగా జగన్ సొంత జిల్లా, నియోజకవర్గం పులివెందుల వాసి. అయితే జగన్ అధికారాన్ని ఉపయోగించుకొని ఈ కజిన్ ఆమ్యామ్మాలకు ఎగబడ్డారు. స్వయంగా సీఎం జగన్ కుటుంబానికి దగ్గర బంధువైన వైఎస్ కొండారెడ్డి కాంట్రాక్టర్లను కమీషన్ అడిగి తాజాగా అడ్డంగా బుక్ అయ్యాడు. చివరకు ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం పెద్దది అయ్యి ఈయన అరెస్ట్ కు దారితీసింది. జాతీయ స్థాయిలో సీఎం జగన్ కు అప్రతిష్ట పాలు చేసింది. జాతీయ మీడియా అంతా అవినీతిలో ‘సీఎం జగన్ కజిన్’ అరెస్ట్ అని పతాకస్థాయిలో వార్తలు వండివార్చి ఏపీ సీఎంను అభాసుపాలు చేస్తున్నాయి. అసలు దీని వెనుక పెద్ద కథే ఉందని తర్వాత తెలిసింది.

Jagan cousin arrest

YS Kondareddy, jagan

-ఎవరీ వైఎస్ కొండారెడ్డి?
వైఎస్ కుటుంబానికి బంధువైన వైఎస్ కొండారెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండల వైసీపీ ఇన్ చార్జీగా ఉన్నారు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలోనూ చురుకుగా పాల్గొన్నారు. చక్రాయపేటలో వైసీపీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. జగన్ కు కజిన్ అవుతారు.

Also Read: Gadapa Gadapaku YCP: గడపగడపకు వెళ్లలేం.. అధికార వైసీపీ నాయకుల్లో వణుకు..

-కొండారెడ్డి చేసిన పని ఏంటి?
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పులివెందుల-రాయచోటి రహదారి కాంట్రాక్ట్ ఓకే అయ్యి పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు కాంట్రాక్టును కర్ణాటకలోని ఎస్.ఆర్.కే కన్ స్ట్రక్షన్ సంస్థ దక్కించుకొని చేస్తోంది. ఇది కర్ణాటకలో అధికారంలో ఉన్న ఓ బీజేపీ నేతకు చెందిన సంస్థగా చెబుతున్నారు. ఈ సంస్థ రోడ్డు పనులు చేస్తున్న సమయంలో చక్రాయపేటలో పనులు జరగాలంటే డబ్బులు ఇవ్వాలని.. కమీషన్ చెల్లించాలని వైఎస్ కొండారెడ్డి సదురు కాంట్రాక్టర్ ను బెదిరించినట్టు ప్రచారం సాగుతోంది. వైఎస్ జగన్ కు కజిన్ కావడంతో ఆ కాంట్రాక్టర్ ఈ వ్యవహారాన్ని బీజేపీ నేత దృష్టికి తీసుకెళ్లారు. సదురు బీజేపీ నేత నేరుగా సీఎం జగన్ ను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

YS Kondareddy

YS Kondareddy

-సొంత కజిన్ నే అరెస్ట్ చేయించిన జగన్
సీఎం జగన్ సొంత జిల్లాలో కాంట్రాక్టర్లను బెదిరించిన కజిన్ తీరు వివాదాస్పదం అయ్యింది. జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో కడప పోలీసులు ఇవాళ కొండారెడ్డిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొండారెడ్డి కాల్ డేటాను పరిశీలించారు. అతడు సదురు కాంట్రాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేసినట్లు నిర్ధారించారు. దీంతో ఆయన్ను స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపారు. కొండారెడ్డిని కడప జైలుకు తరలించారు.

సీఎం జగన్ సొంత జిల్లాలో.. అదీ సొంత నియోజకవర్గంలో.. సొంత కజిన్ చేయడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. స్థానికంగా కలకలం రేపింది. ఇప్పటికే బాబాయ్ హత్య కేసు కూడా జిల్లాలోనే జరగడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పుడు సొంత కజిన్ ఇలా కాంట్రాక్టర్లను బెదిరించడంతో సీఎం జగన్ వెంటనే చర్యలు తీసుకున్నారు. కాగా వైసీపీ ప్రభుత్వంలో నేతలు ఇలా ఇప్పటికే కాంట్రాక్టర్లకు, పనులు చేసే వారిని బెదిరించి వసూళ్లు చేస్తున్నట్టు ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ కాంట్రాక్టర్ తో పెట్టుకొని ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.  తాజా ఘటనతో మరోసారి ఈ వివాదం సీఎం జగన్ ను ఇరుకునపెట్టినట్టైంది.

Also Read:Jagan Sketch On Chandrababu Arrest: చంద్రబాబును జైలుకు పంపేందుకు జగన్ భారీ స్కెచ్

Recommended Videos:

పొత్తు రాజకీయం, బీజేపీ ప్లాన్ ఏమిటీ | Special Focus on AP Alliance Politics | Janasena BJP Alliance

పవన్ కళ్యాణ్, పొత్తుల ట్రాప్ లో పడకండి || Analysis on Janasena Alliance || Pawan Kalyan || Ok Telugu

Minister Peddireddy Ramachandra Reddy Comments on TDP Alliance || Ok Telugu