Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan VS YS Sharmila : తండ్రి ఆస్తులన్నీ నాకేనంటున్న షర్మిల.. తనవేనంటున్న జగన్.....

YS Jagan VS YS Sharmila : తండ్రి ఆస్తులన్నీ నాకేనంటున్న షర్మిల.. తనవేనంటున్న జగన్.. పరిష్కారం ఎలా?

YS Jagan VS YS Sharmila :  జగన్ ఫ్రస్టేషన్లో ఉన్నారా? షర్మిల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారా? తన పతనాన్ని కోరుకున్న షర్మిలను అంత ఈజీగా విడిచి పెట్టరా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిలపై జగన్ కోర్టును ఆశ్రయించడం సంచలనం గా మారింది. ఒకవైపు చెల్లెలు షర్మిల తో జగన్ సర్దుబాటు చేసుకున్నట్లు టిడిపి అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. అక్కడకు కొద్ది గంటల వ్యవధిలోనే వారిద్దరిపై ఏకంగా కోర్టును ఆశ్రయించినట్లు వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు చూస్తే జగన్ ఏ స్థాయిలో బాధపడుతున్నారో అర్థమవుతుంది. తన గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్ట, ప్రత్యర్థులతో చేతులు కలపడం, రాజకీయంగా ఇబ్బంది పెట్టడం.. తదితర అంశాలను ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.తన రాజకీయ ఉన్నతికి అడ్డు తగులుతున్నారని.. అధికారానికి దూరం చేసేలా షర్మిల వ్యవహరించారని పరోక్షంగా చెప్పుకొచ్చారు జగన్.

* వ్యక్తిగత వివాదాలతోనే
అయితే వ్యక్తిగత విభేదాలే సోదరితో ఈ పరిస్థితి జగన్ కు వచ్చింది. జగన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే సమయంలో షర్మిలకు సైతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ నలుగురికి సమానంగా వాటాలు దక్కాలన్నదే రాజశేఖర్ రెడ్డి కోరిక. అయితే ఇక్కడే తిరకాసు ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. అంతకుముందు పారిశ్రామికవేత్తగా కూడా కొనసాగారు. తండ్రి అధికారం తోడు కావడంతో చాలా రకాలుగా ఆస్తులు పెంచుకున్నారు. అయితే అలా సంపాదించుకున్న ఆస్తులు.. రాజశేఖర్ రెడ్డి ద్వారా వచ్చాయని షర్మిల భావిస్తున్నారు. ఆ ఆస్తులను సైతం వాటాలుగా అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ఆస్తులు వివాదంగా మారాయి. ఇంతటి వివాదానికి కారణం అవుతున్నాయి.

* అలా వ్యాపారాల విస్తరణ
తండ్రి అధికారంలో ఉండగా.. పరిశ్రమలు నిర్వహించి తన వ్యాపారాలను విస్తరించుకున్నారు జగన్. అవన్నీ తన సొంత ఆస్తులుగా భావించుకున్నారు. కానీ వాటిపై సైతం షర్మిల వాటాలు అడుగుతుండడంతో జగన్ నిరాకరించారు. షర్మిల లో అసహనానికి కారణమయ్యారు. అందుకే ఆమె జగన్ ను తీవ్రంగా విభేదించడం ప్రారంభించారు. అవన్నీ తండ్రి ఆస్తులు లేనని షర్మిల భావిస్తుండగా.. తాను సొంతంగా సమకూర్చుకున్నానని జగన్ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పడినవే ఈ వివాదాలు. అయితే అదే వివాదాలు ఆ కుటుంబం పాలిట శాపంగా మారాయి. బయట ప్రపంచంలో వారిని పలుచన చేశాయి. మరి వాటికి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular