Tollywood: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా విడాకుల వ్యవహారం గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పట్లో ఈ చర్చ ఆగేలా కనిపించడం లేదు. అభిమానులకు ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి, మరో పక్క ప్రయార్డుల నాన్ స్టాప్ దాడులు మధ్య పవన్ అభిమానులు నలిగిపోతున్నారు. కొంతమంది నిన్ను ఇక సమర్ధించలేమని , బయట మమ్మల్ని తల ఎత్తుకొని తిరగనివ్వకుండా చేస్తున్నావని , ఒకటి రెండు సార్లు జరిగితే పొరపాటు అనుకోవచ్చు కానీ , వరుసగా మూడు సార్లు విడాకులు అంటే చిన్న విషయం కాదని , కచ్చితంగా పవన్ కళ్యాణ్ వైపు నుండే తప్పు ఉందని కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తుంటే , అధిక శాతం అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ని ఇప్పటికీ సమర్థిస్తూ , ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్ని రోజులు రాజకీయపరంగా చాలా సైలెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ , ఎట్టకేలకు నేడు బయటకు వచ్చాడు.
సచివాలయం లో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సమావేశం లో పాల్గొన్నాడు.అయితే ఈ గ్యాప్ లో మరో వార్త సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఒక స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకుందట. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతుందట. ప్రస్తుతం ఆమె తన భర్త కి దూరం గా, హైదరాబాద్ లోనే తన పిల్లలతో కలిసి ఉంటుందట. మరి ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్?, ఎందుకు ఇలా చేసిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత అసలు టాలీవుడ్ లో ఏమి జరుగుతోంది?, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విడాకులు తీసుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఊహించండి , మీ అభిప్రాయన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.