Pawan Kalyan: ఈరోజు ఉదయం నుండి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం గురించి సోషల్ మీడియా లో ఏ రేంజ్ చర్చ నడుస్తుందో అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు అన్నా లెజినోవా తో ఎంతో మంచి సన్నిహిత దాంపత్య జీవితాన్ని గడిపిన పవన్ కళ్యాణ్ , అకస్మాత్తుగా నిన్న అన్నా లెజినోవా తో విడాకులు తీసుకుంటున్నాను అని మీడియా కి ఒక ప్రకటన ఇవ్వడంత అందరూ ఒక్కసారి షాక్ కి గురయ్యారు. అభిమానుల నోటి నుండి మాట కూడా రాలేదు. రెండు నెలల క్రితమే వీళ్ళు ఎంతో మంచి సన్నిహితంగా ఉన్నట్టు కనిపించారు. కానీ ఇంతలోపే ఏమైందో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. ప్రత్యర్థులకు సమాధానం చెప్పలేక ఈరోజు ఉదయం నుండి మదన పడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చాలా కూల్ గా నేడు సచివాలయం లో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యాడు.
ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పవన్ కళ్యాణ్ విడాకుల అంశాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ పలు కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ కష్టంలో ఉన్న వ్యక్తిని ఇంకా దూషించడం నైతికంగా సరికాదని చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఇప్పటికే కింద పడిపోయిన వారిని తొక్కడం అమానుషం. ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్లూ మనుషులే. మనం అద్దాల ఇంట్లో ఉంటూ ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరకూడదు. నేను ఇలా రాశానని ఊహాగానాలు స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే ఓ సమాజంగా మనం మరింత మెరుగ్గా ఉండాలని నమ్ముతా. నేను సెన్సిబుల్‌గా ఉన్నందుకు పేటీఎం ఏమీ రాలేదు’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ సపోర్టు చేస్తున్నట్టుగా అనిపించినా , ఆమెలోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పోస్ట్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనేక విధాలుగా స్పందిస్తున్నారు.
రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్టుగా అనిపిస్తున్నాయని , ఇలాంటి సమయం లో ఆమె రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం అసలు లేదని, అభిమానులు ఇలాంటి పోస్టులకు నెగెటివ్ గా రియాక్ట్ అయితే మళ్లీ రేణు దేశాయ్ బాగా హర్ట్ అవుతుందని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ అంశం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అర్థం కావడం లేదని అంటున్నారు ఫ్యాన్స్. మరి పవన్ కళ్యాణ్ ఈ అంశం పై స్పందిస్తాడో లేదో చూడాలి.