Pawan Kalyan: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతూ ముందుకు వెళ్తూనే ఉంది. ఈ చిత్రం తో పాటు నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. అందులో మూడు సినిమాలకు సూపర్ హిట్ టాక్స్ వచ్చాయి. అయినప్పటికీ ఆ మూడు సినిమాలు పండుగ సెలవులు తర్వాత చల్లారిపోయాయి. కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం మాత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము లేపేస్తోంది. ఇకపోతే ఈ చిత్రం గురించి రీసెంట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఇది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కాదు, సంక్రాంతి బాస్ బస్టర్ అంటూ కామెంట్స్ చేసాడు. ఇక నేడు చిరంజీవి సోదరుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఈ చిత్రం గురించి ట్వీట్ వేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘ అన్నయ్య చిరంజీవి కి, ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ టీం మొత్తానికి ఈ సినిమా భారీ విజయం సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల నుండి అన్నయ్య చిరంజీవి గారు మన అందరి హృదయాలను ఎలా గెలుచుకున్నాడో, ఇప్పటికీ తన అద్భుతమైన నటన, కామెడీ, డ్యాన్స్ తో అది కొనసాగిస్తున్నాడు. ఈ సినిమా ఆయన అద్భుతమైన ఫిల్మోగ్రఫీ లో ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకం గా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ప్రత్యేక అభినందనలు. మెగాస్టార్ చిరంజీవి గారిని, విక్టరీ వెంకటేష్ గారిని ఒకే ఫ్రేమ్ లో వెండితెర పై చూడడం కనుల పండుగ లాగా అనిపించింది. భీమ్స్ గారు అందించిన అద్భుతమైన మ్యూజిక్ సినిమాకు ఎంతో బలాన్ని చేకూర్చింది. నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గార్లకు ప్రత్యేక శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ ట్వీట్ పడింది. అన్నయ్య గురించి తమ్ముడు మాట్లాడడం, తమ్ముడు గురించి అన్నయ్య మాట్లాడడం, అభిమానులకు ఎల్లప్పుడూ గూస్ బంప్స్ రప్పించే సందర్భాలు. అనిల్ రావిపూడి తో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని, అది వచ్చే సంక్రాంతికి రాబోతుందని వార్తలు వినిపిస్తున్న ఈ నేపథ్యం లో , పవన్ కళ్యాణ్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ గురించి మాట్లాడడం, ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే వార్తలకు మరింత బలం చేకూర్చింది. రాబోయే రోజుల్లో ఈ వార్తల్లో ఎంతమేరకు నిజముందో చూడాలి.
Hearty congratulations to Megastar Chiranjeevi garu @KChiruTweets, and the entire team of #ManaShankaraVaraPrasaGaru on Mega Blockbuster success.
For over four decades, Chiranjeevi garu has remained close to the hearts of people, continuing to entertain with the same passion… pic.twitter.com/uajJOWOQHz
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 22, 2026