Homeఆంధ్రప్రదేశ్‌Journalism: జర్నలిజంలో పరిస్థితికి జర్నలిస్టులు కారణం కాకపోయినప్పటికీ.. అంతిమంగా చేయాల్సింది ఊడిగమే!

Journalism: జర్నలిజంలో పరిస్థితికి జర్నలిస్టులు కారణం కాకపోయినప్పటికీ.. అంతిమంగా చేయాల్సింది ఊడిగమే!

Journalism: జెఫ్ బెజోస్ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఇదే సూత్రం జర్నలిజానికి (journalism) కు వర్తిస్తుంది. వార్తలను అమ్ముకోవడమే జర్నలిజం ప్రాథమిక సూత్రం. కాకపోతే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య తాము వారదులుగా ఉన్నామంటూ మీడియా సంస్థలు చెబుతుంటాయి.. వెనుకటికి స్వాతంత్ర ఉద్యమ కాలంలో మీడియా ప్రముఖంగా తన వంతు పాత్రను పోషించింది కాబట్టి.. ఆ తర్వాత కాలంలో జేజేలు అందుకుంది. కానీ రాను రాను ఇందులోకి వ్యాపార సంస్థలు, వ్యాపారులు ప్రవేశించడంతో పూర్తిగా అమ్మకపు సార్కు అయిపోయింది. కొద్దిరోజులు ప్రింట్ మీడియా వర్ధిల్లింది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా తన హవాను మొదలుపెట్టింది. ఇప్పుడు డిజిటల్ మీడియా సత్తా చాటుతోంది.. మీడియా రూపం మారుతుంది గాని.. అంతిమంగా దీనిని అంటిపెట్టుకొని ఉన్న జర్నలిస్టుల పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. డిజిటల్ మీడియాలో సొంతంగా ఎదగడానికి అవకాశం ఉన్నప్పటికీ.. దానికి సంబంధించిన విధివిధానాల విషయంలోనే ఇప్పటికీ లోపభూయిష్టత కొనసాగుతోంది. ఇతమిద్ధంగా డిజిటల్ మీడియాకు విధివిధానాలు అంటూ లేకపోయినప్పటికీ.. ఇందులో కొంతమంది రాణించగలుగుతున్నారు. ప్రశ్నించే స్వభావాన్ని ప్రదర్శించగలుగుతున్నారు. ఇకమీదట మీడియాలలో పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి. ప్రింట్ మీడియా విషయానికొస్తే ఒక మూడు సంస్థలు మాత్రమే ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లిస్తున్నాయి. కేవలం ఒక సంస్థ మాత్రమే కార్మిక చట్టాలను పాటిస్తోంది. ఇక ఆ సంస్థ కూడా కొన్ని విషయాలలో నిర్లక్ష్యపు పూరితమైన విధానాలు అవలంబిస్తోంది. ఒక సంస్థ అయితే అత్యంత దారుణంగా ఉద్యోగులను వేధిస్తోంది. జర్నలిజం (journalism) కూడా అమ్మకపు సరుకుగా మారిపోయింది. అయితే ఇక్కడ ఆ అమ్మకపు ఫలాలను జర్నలిస్టులు(journalist) లకు దక్కకపోవడమే ఆధునిక విధి వైచిత్రి.

కుండబద్దలు కొట్టినట్టు చెప్పలేకపోయినప్పటికీ..

జర్నలిజం(journalism) లో నేటి పరిస్థితులపై ఓ యూ ట్యూబర్ నిర్వహించిన పాడ్ కాస్ట్ (podcast) లో ఆంధ్రజ్యోతి (Andhra Jyothi) మాజీ ఎడిటర్(editor) కే శ్రీనివాస్ (K. Srinivas) పాల్గొన్నారు. జర్నలిజంలో పరిస్థితిపై ఆ యుట్యుబర్ అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. “జర్నలిజంలో పరిస్థితికి జర్నలిస్టులు కారణం కాదు. ఇక్కడ ప్రతిదీ వ్యాపార వస్తువైంది. ఇందుకు జర్నలిజం మినహాయింపు కాదు. ఏదైనా సరే జర్నలిజం అనేది స్థిరంగానే ఉంది. కాకపోతే ఇది రూపం మారడం వల్లనే ఇన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తర్వాతే తరంలో ఎలాంటి మార్పు జరుగుతుందో తెలియదు గాని.. ఇప్పటికైతే స్వతంత్ర గొంతులు గట్టిగానే మాట్లాడుతున్నాయి. ఇలాంటి భావజాలం మరింత వ్యాపిస్తేనే మీడియా తాను అనుకున్న పని చేయగలదు. రాజకీయ పార్టీల ట్రోల్స్ గ్రూపులు.. మిగతావన్నీ ఎలాంటి పనులు చేస్తున్నప్పటికీ.. మీడియా తన స్థైర్యాన్ని విస్మరించకూడదు. అయితే ఇందులో రాజకీయ పార్టీలు పత్రికలను ఏర్పాటు చేయడం.. రాజకీయ నాయకులు న్యూస్ చానల్స్ ను స్థాపించడం వల్ల కాస్త వాతావరణం కలుషితం అయిపోయినప్పటికీ ఇంకా కొంతవరకు సానుకూలత కనిపిస్తూనే ఉందని” శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అయితే ఆ యూట్యూబర్ అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పినప్పటికీ.. అంతిమంగా జర్నలిజంలో ఒక సంక్షోభం మాత్రం ఉందని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మృదు స్వభావిగా.. మిత భాషిగా పేరుపొందిన శ్రీనివాస్ డిజిటల్ మీడియాలోకి వస్తున్నానని చెప్పడం ఇక్కడ ఆశ్చర్యకర విషయం.. చూడాలి మరి డిజిటల్ మీడియాలో శ్రీనివాస్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో..

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular