India and Russia: సాధారణంగా దేశాల మధ్య సంబంధాలు అవసరాల మేరకు ఉంటాయి. లేదంటే పరస్పర లాభాలపై ఆధారపడి ఉంటాయి. అయితే కొన్ని బంధాలు సహజంగా ఏర్పడతాయి. కాలం పరీక్షలను తట్టుకుంటాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బంధం మీత్రం వీడవు. దూరం కావు. ఒకరికి ఒకరు అన్నట్లుగా పనిచేస్తాయి. అలాంటి దేశాల్లో భారత్–రష్యా బంధం ఒకటి. నాటి సోవియట్ యూనియన్ నుంచి ప్రస్తుత రష్యా వరకు, ఇరు దేశాల సంబంధాలు అనేక మలుపులు తిరిగినా, ధ్రుడంగా నిలిచాయి. ప్రపంచ దేవాల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. మార్పులు ఎన్ని వచ్చినా, ఈ మైత్రీ అస్థిరమవలేదు.
శ్రీశ్రీ రచనల్లో..
సాహిత్యం సినిమాల్లో ప్రతిబింబించిన అనుబంధం ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీ రచనల్లో రష్యా పట్ల భారతీయుల భావోద్వేగాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన కవితలు రష్యాను ఉత్సాహంగా వర్ణిస్తాయి, ఇరు సమాజాల మధ్య భావనాత్మక బంధాన్ని గుర్తు చేస్తాయి. అదేవిధంగా, బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ చిత్రాలు రష్యాలో భారీ పాపులారిటీ సాధించాయి. ఆయన ఒక సినిమాలోని పాట రష్యా సంప్రదాయ టోపీని ప్రస్తావిస్తూ, సాంస్కృతిక వైవిధ్యాన్ని చూపుతుంది. సోవియట్ కాలంలో కమ్యూనిస్ట్ సాహిత్యం భారతదేశంలో విస్తృతంగా చదివబడింది. రష్యన్లు భారతీయులపై ప్రత్యేక ఆదరణ చూపుతారని సాధారణ భావన.
రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా..
రష్యా నాయకత్వంలో లెనిన్, స్టాలిన్, గోర్బచెవ్ వంటి వ్యక్తులు సోవియట్ యుగాన్ని నడిపించారు. వారి కాలంలో భారత్‌తో ఏర్పడిన సంబంధాలు ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హయాంలోనూ అలాగే కొనసాగుతున్నాయి. రాజకీయాలు, నేతల మార్పులతో సంబంధం లేకుండా ఇరు దేశాల మైత్రి కొనసాగుతోంది. 2000లో కొంత స్థబ్ధత ఏర్పడినా – రష్యా ఆర్థిక బలహీనత, అమెరికాతో భారత్ టెక్నాలజీ టైలు కారణంగా – అది తాత్కాలికమే. మధ్యలో పాకిస్తాన్‌తో రష్యా సంబంధాలు పెరిగినా, అది దీర్ఘకాలికం కొనసాగలేదు. ప్రస్తుతం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావంతో భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడ్డాయి.
యుద్ధ సమయాల్లో అండగా..
రష్యా నుంచి భారత్ అత్యధిక ఆయుధాలు కొంటుంది, ఇది వారి రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. 1971లో భారత్–పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా, చైనా పాక్ వైపు నిలిచాయి. కానీ, సోవియట్ యూనియన్ భారత్‌కు మద్దతిచ్చింది. బంగాళాఖాతంలో సబ్‌మెరైన్‌ను ఉంచి ఒత్తిడి తెచ్చింది. దీంతో పాక్, అమెరికా వెనక్కి తగ్గాయి. రష్యాకు చైనాతో సుదీర్ఘ సరిహద్దు, సత్సంబంధాలు ఉన్నప్పటికీ, పుతిన్ 25 సంవత్సరాలుగా భారత్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. 2012లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుతిన్‌ను భారత్‌కు నిజమైన స్నేహితుడిగా ప్రశంసించారు.