Akkineni Hero Meenakshi Chaudhary: అక్కినేని కుటుంబం లో మరో సారి పెళ్లి భాజాలు మ్రోగనుందా?, ప్రముఖ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) అక్కినేని కుటుంబానికి కోడలు కాబోతుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్(Naga Sushanth) కి, మీనాక్షి చౌదరి కి మధ్య చాలా కాలం నుండి ప్రేమాయణం నడుస్తుందని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్ గత కొంతకాలం గా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఇది రూమర్ కాదు, నిజమే అని త్వరలో అందరూ అర్థం చేసుకునే రోజు వస్తుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. గతం లో వీళ్లిద్దరు కలిసి ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రం లో హీరో హీరోయిన్లు గా నటించారు. మీనాక్షి చౌదరి కి ఇదే తొలిసినిమా. ఈ సినిమా షూటింగ్ సమయం లో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
ఆ స్నేహం కాస్త కాలక్రమేణా ప్రేమ గా మారిందని అంటున్నారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా, మీనాక్షి చౌదరి కి టాలీవుడ్ లో బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ సుశాంత్ కెరీర్ మాత్రం డెవలప్ అవ్వలేదు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగులుతూ వచ్చాయి. దీంతో ఆయన సినిమాల సంఖ్య కూడా బాగా తగ్గించేసాడు. ఈమధ్య కాలం లో ఆయన హీరో పాత్రలకు దూరమై క్యారక్టర్ రోల్స్ కూడా చేస్తున్నాడు. కెరీర్ పరంగా ఈ ఇద్దరికీ ప్రస్తుతం ఇంత తేడా ఉంది. అయినప్పటికీ వీళ్లిద్దరు ఎలాంటి మనస్పర్థలు లేకుండా ప్రేమ బంధాన్ని చాలా కాలం నుండి కొనసాగిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇప్పుడు అకస్మాత్తుగా వీళ్లిద్దరి వ్యవహారం గురించి సోషల్ మీడియా లో చర్చకు రావడానికి ప్రధాన కారణం రీసెంట్ గా వీళ్లిద్దరు ఒక ప్రైవేట్ పార్టీ లో కనిపించడమే.
ఇక మీనాక్షి చౌదరి విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె అక్కినేని నాగ చైతన్య తో కలిసి ‘వృష కర్మ’ అనే చిత్రం లో నటిస్తోంది. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది ఈ ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం పై ఆడియన్స్ లో, అక్కినేని ఫ్యాన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో పాటు నవీన్ పోలిశెట్టి తో కలిసి ‘అనగనగ ఒక రాజు’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే నెల సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.