https://oktelugu.com/

Unstoppable with NBK’ show : సీఎం చంద్రబాబు నాయుడు చేత కూరగాయలను కొనిపించిన బాలయ్య..ఒక రేంజ్ లో ఆటపట్టించాడుగా!

మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ ఎపిసోడ్ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు. రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ కి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథి గా విచ్చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 21, 2024 / 02:49 PM IST

    Unstoppable with NBK' show

    Follow us on

    Unstoppable with NBK’ show : ఇండియా లోనే మోస్ట్ పాపులర్ టాక్ షోస్ లో ఒకటిగా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ టాక్ షో ఆహా మీడియా ఓటీటీ యాప్ ని దేశంలోనే టాప్ 10 యాప్స్ లో ఒకటిగా నిలిపింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి నేటి తరం సూపర్ స్టార్స్ అందరూ ఈ బిగ్గెస్ట్ టాక్ షోలో పాల్గొని బాలయ్యతో సరదాగా చిట్ చాట్ చేసారు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండింగ్ లోనే ఉన్నాయి. మూడు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ టాక్ షో, ఇప్పుడు నాల్గవ సీజన్ ని ఈ నెల 25 వ తారీఖు నుండి ప్రారంభించుకోనుంది. మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ ఎపిసోడ్ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు. రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ కి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథి గా విచ్చేసారు.

    ఆయనతో పాటు కొడుకు నారా లోకేష్ కూడా పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్ లో ఈ ముగ్గురి మధ్య సాగిన సరదా సంభాషణ చూసి అభిమానులు మురిసిపోయారు. ఇప్పుడు మళ్ళీ నాల్గవ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇస్తున్న మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇదే. ఈ ఎపిసోడ్ మొత్తం వంద రోజుల పాలనలో ఎదురుకున్న సవాళ్లను ఎలా అధిగమించాడు అనే అంశం పైన మాత్రమే కాకుండా, విజయవాడ వరద భీభత్సం సమయంలో ముఖ్యమంత్రిగా ఎలాంటి ఒత్తిడిని ఎదురుకున్నాడు అనే దాని మీద బాలయ్య సీఎం చంద్రబాబు ని పలు ప్రశ్నలు అడిగాడట. అంతే కాకుండా వీళ్ళ మధ్య వ్యక్తిగత సరదా సంభాషణలు కూడా చాలానే జరిగాయట.

    చంద్రబాబు తో బాలయ్య పలు టాస్కులు కూడా ఆడించాడట. ఆయనతో కూరగాయలను కూడా కొనిపించాడట. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ కి చంద్రబాబు తో కలిసి పవన్ కళ్యాణ్ కూడా వస్తాడని పెద్ద చర్చ జరిగింది కానీ, చివరి నిమిషం లో ఆయన రాలేకపోయారు. కానీ ఈ సీజన్ లో ఎదో ఒక ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రెండవ సీజన్ చివరి ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ తోనే చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కేవలం ఆయన జనసేన పార్టీ అధినేత గా మాత్రమే పాల్గొన్నాడు. కానీ ఈసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి హోదాలో పాల్గొనబోతున్నాడు. చంద్రబాబు నాయుడుతో సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు నడిపే విషయంలో పవన్ కళ్యాణ్ పరుగులు తీస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన పాలన అనుభవం గురించి కూడా ఈ ఎపిసోడ్ లో చర్చించే అవకాశం ఉంది.