IPAC: బిగ్ డెసిషన్.. ఐప్యాక్ ను వదిలించుకున్న వైసీపీ

గత కొద్ది రోజులుగా వైసిపి సోషల్ మీడియాను సజ్జల భార్గవరెడ్డి హ్యాండిల్ చేస్తున్నారు. ఐ ప్యాక్ కు సమాంతరంగా వైసీపీ సోషల్ మీడియాను డెవలప్ చేశారు.

Written By: Dharma, Updated On : May 21, 2024 4:28 pm

ipac office closed in ap

Follow us on

IPAC: ఐప్యాక్ సంస్థ ఏపీ నుంచి ప్యాకప్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్పష్టమైన సమాచారం ఉండడం వల్ల ఆ సంస్థ ప్యాకప్ చెప్పిందన్న టాక్ నడుస్తోంది. పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత సీఎం జగన్ ఐ ప్యాక్ కార్యాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచే గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వాస్తవానికి ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లి జగన్ ఆతరహా ప్రకటన చేస్తారని సొంత పార్టీ శ్రేణులు కూడా ఊహించలేదు. కానీ హైదరాబాద్ వేదికగా ప్రశాంత్ కిషోర్ వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని చెప్పుకొచ్చారు. ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకే జగన్ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. కౌంటింగ్ వరకు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పాలంటే.. ప్రశాంత్ కిషోర్, ఐ ప్యాక్ టీం ఒక్కటి కాదని సంకేతాలు ఇచ్చేందుకే.. జగన్ ఆ తరహా ప్రకటన చేయాల్సి వచ్చినట్టు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా వైసిపి సోషల్ మీడియాను సజ్జల భార్గవరెడ్డి హ్యాండిల్ చేస్తున్నారు. ఐ ప్యాక్ కు సమాంతరంగా వైసీపీ సోషల్ మీడియాను డెవలప్ చేశారు. అయితే వైసిపి విజయం సాధిస్తుందని.. ఐప్యాక్ టీం సేవలు కొనసాగుతాయని జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఉన్నట్టుండి ఐప్యాక్ కు చెందిన 300 మంది ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు. ఉన్న వారిని కొనసాగిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. గత ఏడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అంచనా వేయడంలో కూడా ఐప్యాక్ తప్పడుటగులు వేసింది. అప్పటినుంచి వైసీపీతో ఆ బృందానికి ఒక రకమైన గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. ఎన్నికల ముంగిట కూడా ఐప్యాక్ కు కొన్ని రకాల చెల్లింపులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వివాదం ఏర్పడగా.. సీఎం సతీమణి భారతి సర్దుబాటు చేసినట్లు టాక్ నడిచింది.

ఐ ప్యాక్ కు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని బయట ఒక టాక్ నడుస్తోంది. అయితే సరిగ్గా కౌంటింగ్ కు ముందు ఐప్యాక్ ఏపీ నుంచి ప్యాకప్ అవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఓటమిపై స్పష్టమైన సమాచారం ఉండడంతోనే ఐప్యాక్ యూటర్న్ అయిందని.. ఇప్పటికే సజ్జల భార్గవ్ నేతృత్వంలోని వైసీపీ సోషల్ మీడియా పై కేసులు కూడా నమోదయ్యాయి. సజ్జల భార్గవ్ బయటకు కనిపించడం లేదు.అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఐ ప్యాక్ టీము వెళ్లిపోవడం.. అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం నుంచి కొంతమంది స్వచ్ఛందంగా తప్పుకోవడంఅనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా విభాగం.. ఐప్యాక్ కు అనుబంధంగా పనిచేయడంతో.. ఒకవేళ వైసీపీ ఓడిపోయినా అదే టీం కొనసాగుతుందన్న ధీమా ఉన్నట్లు తెలుస్తోంది.