శతాబ్దం తరువాత వృషభ రాశిలోకి త్రిగ్రాహి సంచారం… ఈ రాశులపై ఎలాంటి ప్రభావం ఉండనుందంటే?

త్రిగ్రాహి ప్రభావం మేష రాశిపై పడనుంది. దీంతో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు వస్తుంది.

Written By: Chai Muchhata, Updated On : May 21, 2024 4:27 pm

Five Grahe horoscope

Follow us on

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కదలికల వల్ల రాశులపై ప్రభావం చూపుతుంది. లేటేస్ట్ గా వృషభ రాశిలోకి సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి ప్రయాణించనున్నాడు. ఇలా త్రిగ్రాహి సంచారం దాదాపు శతాబ్ధం తరువాత జరగనుంది. దీంతో కొన్ని రాశులపై ఈ త్రి గ్రాహి సంచార ప్రభావం ఉండనుంది. దంతో ఏ యే రాశుల వారి జీవితాలు ఎలా ఉండనున్నాయంటే?

త్రిగ్రాహి ప్రభావం మేష రాశిపై పడనుంది. దీంతో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు వస్తుంది.

మిథున రాశి వారికి త్రిగ్రాహి సంచార ఫలితం ఉండనుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఆఫర్లు పొందుతారు.

కన్యారాశి వారు ఉత్సాహంగా జీవితాన్ని కొనసాగిస్తారు. కొన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులకు డబ్బు బాగా వచ్చి చేరూతుంది. ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి. పోటీ పడి కొన్ని విజయాలను సొంతం చేసుకుంటారు.

వృశ్చిక రాశిపై త్రిగ్రాహి సంచాల ప్రభావం ఉండనుంది. ఈ రాశివారు వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వీరికి అనుకోని అదృష్టం వరించనుంది.

ధనస్సు రాశి వారికి అనుకోని అదృష్టం వరించనుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి.

మీన రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల కెరీర్ బాగుంటుంది.వ్యాపారులు లాభాలు పొందుతారు.