https://oktelugu.com/

Pithapuram Varma: పిఠాపురం వర్మ ఇక ఎమ్మెల్సీ.. ఆసక్తికర ట్విట్!

ఏపీ శాసనమండలికి సంబంధించి రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేసేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ రెండు పదవులకు వర్మతో పాటు చాలామంది నాయకుల పేర్లను పరిశీలిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 26, 2024 6:39 pm
    Pithapuram Varma

    Pithapuram Varma

    Follow us on

    Pithapuram Varma: ఈ ఎన్నికల్లో మార్మోగిపోయిన పేరు పిఠాపురం వర్మ. అంతవరకు ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రమే. ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించారో.. నాటి నుంచే తెరపైకి వచ్చింది వర్మ పేరు. రాష్ట్రస్థాయి నాయకుడిగా కూడా గుర్తింపు దక్కించుకున్నారు ఆయన. అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేశారు. పవన్ ను గెలిపించేందుకు కష్టపడ్డారు. పవన్ ను గెలిపిస్తే ఓటమి ప్రభుత్వంలో తొలి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని కూడా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్మ ఎమ్మెల్సీ పదవి తెరపైకి వస్తోంది.

    ఏపీ శాసనమండలికి సంబంధించి రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేసేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ రెండు పదవులకు వర్మతో పాటు చాలామంది నాయకుల పేర్లను పరిశీలిస్తున్నారు. ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా వర్మకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆయన సైతం పదవిపై ధీమాతో ఉన్నారు. కానీ ఎవరూ బయటపడటం లేదు. తుది నిర్ణయానికి వచ్చాక టిడిపి ఆ రెండు పేర్లు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. వర్మ కైతే ఛాన్స్ తప్పదని తెలుస్తోంది.

    అయితే ఈరోజు ఆసక్తికరమైన ట్విట్ చేశారు వర్మ. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో అన్ని తానే ముందుండి నడిపించిన వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి? అంటూ ఆయన స్వయంగా ట్వీట్ పెట్టుకున్నారు. ఓ టీవీ ఛానల్ లో ఈ మేరకు వచ్చిన కథనాన్ని దీనికి జత చేశారు. తద్వారా తనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైన విషయాన్ని బహిర్గతం చేశారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత వర్మ ఈ తరహా ప్రకటన చేసి ఉంటారని తెలుస్తోంది.