TDP vs Republic TV: దేశీయ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో వారం రోజులుగా విమానాలు నడపడం లేదు. షెడ్యూల్‌లో గందరగోళం కారణంగా.. విమానాలు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. టికెట్ చార్జీల చెల్లింపు విషయంలోనూ జాప్యం చేస్తోంది. ఈ క్రమంలో ఇండిగో విమానాల సమస్యలు దేశవ్యాప్తంగా గందరగోళానికి దారితీసినప్పుడు టీడీపీ నాయకుడు దీపక్ రెడ్డి రిపబ్లిక్ టీవీ డిబేట్‌లో మంత్రి నారా లోకేష్ పేరు తెచ్చి విషయాన్ని సంక్లిష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని అంశంలో డిఫెన్సివ్ వాదనలు చేయడం పార్టీకి నష్టం కలిగించింది. అర్నబ్ గోస్వామి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా విషయాన్ని మలుపు తిప్పడం సమస్యను మరింత పెంచింది.
రిపబ్లిక్ టీవీపై బాయ్‌కాట్ ప్రకటన..
టీడీపీ నేతలు అర్నబ్ జర్నలిజం, ఛానల్ నాణ్యతపై విమర్శలు మొదలుపెట్టి సోషల్ మీడియాలో బాయ్‌కాట్ పిలుపు ఇచ్చారు. గతంలో కష్టకాలంలో రిపబ్లిక్ టీవీ టీడీపీకి మద్దతుగా నిలిచి, చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్‌కు జాతీయ మీడియాలో వేదిక కల్పించింది అర్నబ్ గోస్వామినే. తాజాగా రిపబ్లిక్ టీవీపై చర్చ పెట్టడం అర్నబ్‌కు కోపం తెప్పించింది.
చంద్రబాబు, మంత్రులపై దాడి..
బాయ్‌కాట్ ప్రకటనకు అర్నబ్ కోపం వచ్చింది. దీంతో చంద్రబాబు, లోకేష్, కేంద్ర మంత్రి రామ్‌మోహన్ నాయుడును నిలదీశారు. ఇండిగో సమస్యకు కేంద్ర విమానయాన శాఖ వైఫల్యమే కారణమని టీడీపీ భావిస్తున్నప్పటికీ, అర్నబ్ టాపిక్ మలుపు తిప్పి బీజేపీని కాపాడుతున్నారని విమర్శలు వచ్చాయి. లోకేష్ అమెరికాలో ఉండటం వల్ల స్పందన లేకపోవడం వివాదాన్ని మరింత పెంచింది.
ఈ సంఘటన టీడీపీ నేతలు అనవసర విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. రిపబ్లిక్ టీవీ వంటి మీడియాతో సంబంధాలు గతంలో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, స్వయం గోల్‌లు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తాయి. ప్రజలకు సమస్యలు తెలిసినప్పటికీ మీడియా పోరులు రాజకీయ లాభం ఇవ్వవు.