Indian Navy Warships: సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఏపీ సొంతం. దాదాపు 1000 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ నౌకాదళ కేంద్రంగా( East coast Naval centre) విశాఖ ఉంది. రోజురోజుకు ఈస్ట్ కోస్ట్ నౌకాదళ కేంద్రానికి కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన నౌకలను, ఇతర పరికరాలను అందించి బలోపేతం చేస్తోంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చినట్టే. ఇటువంటి పరిస్థితుల్లో రేపు రెండు యుద్ధ నౌకలను విశాఖ కేంద్రంగా జాతికి అందించనుంది భారత నావికాదళం. నౌకాదళ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లెక్కించేలా ఈ రెండు యుద్ధ నౌకలు రేపు జాతి ముందుకు రానున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ రెండు అత్యాధునిక నౌకలు తమ సేవలను ప్రారంభించునున్నాయి. జాతికి అంకితం చేసేందుకు నౌకాదళ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read: ఆరేళ్ల కిందటి అదానీ ప్రాజెక్ట్.. కొత్తగా 2,400 ఎకరాలు.. అసలేంటి కథ!?
రేపు విశాఖ డాక్ యార్డులో..
రేపు విశాఖ నావల్ డాక్ యార్డులో( Naval Dockyard ) ఈ యుద్ధ నౌకల ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగనుంది. ప్రాజెక్టు 17 లో భాగంగా ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎంఎస్ ఉదయగిరి యుద్ధ నౌకల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి హాజరుకానున్నారు. ముంబైలోని మజ్ గావ్ డార్క్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లో ఐఎన్ఎస్ ఉదయగిరి.. కోల్కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లో ఐఎన్ఎస్ హిమగిరి నౌకలను నిర్మించారు. ఇందులో భారత యుద్ధ విమాన చరిత్రలోనే.. ఐఎన్ఎస్ ఉదయగిరి నౌకను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించడం విశేషం.
Also Read: విశాఖ వెళ్లే వారికి గుడ్ న్యూస్!
చైనాకు ధీటుగా..
అంతర్జాతీయ నావికా రంగంలో భారత్ కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇతర తీరదేశాలు, శత్రు దేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. అందుకే భారత నావికాదళం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నౌక నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానాన్ని స్వస్తి పలికింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ యుద్ధ నౌకల నిర్మాణాన్ని చేపడుతోంది భారత ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ నౌక నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న చైనా దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తోంది భారత్. చైనా సగటున 19 నౌకలు తయారు చేస్తుంటే ఏడాదికి… భారత్ మాత్రం 20 యుద్దనౌకలు నిర్మిస్తోంది. అయితే భారత్ తో పోల్చుకుంటే చైనా వాణిజ్య నౌకల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది.