https://oktelugu.com/

Bigg Boss Priyanka Jain: ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో లంచ్ కి వెళ్లి శివకి దొరికిపోయిన బిగ్ బాస్ ప్రియాంక… నెక్స్ట్ ఏమైంది?

ప్రియాంక అనుకోకుండా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కలిసిందట. అతనితో కలిసి లంచ్ కి వెళ్ళింది. వాళ్ళు తింటుండగా సడెన్ గా శివ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇద్దరు కాస్త షాక్ అయ్యారు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 9, 2024 / 04:39 PM IST
    Follow us on

    Bigg Boss Priyanka Jain: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ సీజన్ 7 లో సత్తా చాటింది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇస్తూ టాప్ 5లో నిలిచింది. సీరియల్ నటిగా పాపులర్ అయిన ప్రియాంక జైన్ .. ఈ రియాలిటీ షో ద్వారా మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక ప్రియాంక సీరియల్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ప్రియుడు శివ కుమార్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తుంది.

    ఇక వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని వీడియోల రూపంలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ప్రియాంక పంచుకుంది. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ప్రియాంకకు శివ కుమార్ కంటే ముందు వేరే వ్యక్తిని ప్రేమించినట్లు తెలుస్తుంది. కొన్ని కారణాల వలన ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవడంతో ఇద్దరు విడిపోయారట. మౌనరాగం సీరియల్ సమయంలో శివ కుమార్ పరిచయమయ్యాడు. మొదట్లో మంచి స్నేహితులుగా ఉన్న వీరు ప్రేమికులుగా మారారట. ఇక మిగిలిన కధంతా తెలిసిందే.

    అయితే ప్రియాంక అనుకోకుండా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కలిసిందట. అతనితో కలిసి లంచ్ కి వెళ్ళింది. వాళ్ళు తింటుండగా సడెన్ గా శివ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇద్దరు కాస్త షాక్ అయ్యారు. నా కోసం వచ్చావా అని ప్రియాంక అడిగింది. అవును అంటూ శివ కుమార్ చెప్పారు. ఇక ప్రియాంక ఎక్స్ లవర్ .. నేను వదులుకోవడం వల్లనే ప్రియాంక నీకు దొరికింది అని అంటాడు. అదేంటి అని శివ కుమార్ షాక్ అవుతాడు.

    నా వల్లే నీకు ప్రియాంక దొరికింది. నాకు ప్రపోజ్ చేస్తే నో చెప్పా అని అంటాడు. అయితే ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు టేస్టీ తేజ. సరదాగా శివ కుమార్ ని ఆటపట్టిస్తూ .. మౌనరాగం సీరియల్ లో మొదట తననే హీరోగా అనుకున్నారని, అప్పుడే మా ఇద్దరికీ పరిచయమైందంటూ జోక్ చేసాడు టేస్టీ తేజ. అలా ప్రియాంక తేజ కలిసి శివ కుమార్ ని ఆట ఆట పట్టించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. త్వరలో ప్రియాంక-శివ కుమార్ వివాహం చేసుకోబోతున్నారు.