Homeఆంధ్రప్రదేశ్‌Kadambari Jethwani case : యాక్షన్‌ షురూ.. కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు.....

Kadambari Jethwani case : యాక్షన్‌ షురూ.. కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు.. నెక్ట్స్‌ ఐపీఎస్‌లు?

Kadambari Jethwani case : ఆంధ్రప్రదేశ్‌లో వైసీసీపీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉంది. గతంలో తాను జైలుకు వెళ్లడానికి కారణం టీడీపీ అన్న ధోరణితో జగన్‌ టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అనేక మందిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు. చివరకు చంద్రబాబు నాయుడును కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఐదేళ్లు మౌనం వహించిన టీడీపీ నేతలు ఇప్పుడు అధికారంలోకి రావడంతో దూకుడు పెంచారు. తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులతోపాటు అధికారులపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీ సర్కార్‌ యాక్షన్‌ మొదలు పెట్టింది. ఎన్టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఇద్దరు అధికారులపై వేటు వేసింది. మరికొందరిపై వేటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన తప్పుడు కేసుపై దర్యాప్తు జరుగుతోంది. ఇది పూర్తయితే ఐసీఎస్‌లపైనా వేటు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పారిశ్రామికవేత్త ఫిర్యాదుతో..
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో తన పేరు బయటకు రాకుండా ఆమెను వేధించాలన్న ఓ పారిశ్రామిక వేత్త సూచనలతో పోలీసులు నటిని అరెస్టు చేశారు. తర్వాత ఆమెను రిమాండ్‌కు పంపించారు. బెయిల్‌ వచ్చిన తర్వాత నటి ముంబై వెళ్లిపోయింది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు నటి కేసుపై విచారణ కోరింది. దీంతో టీడీపీ ప్రభుత్వం పునర్విచారణ చేపట్టింది. వైసీపీ ప్రభుత్వ హయంలో విజయవాడ కమిషనరేట్‌ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ గా విధులు నిర్వహించిన సత్యనారాయణను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

ఐపీఎస్‌ ఆదేశాల మేరకే?
ఇదిలా ఉంటే.. కాదంబరి జెత్వానీపై తపుపడు కేసు నమోదు కే అప్పట్లో పనిచేసిన ఓ ఐపీఎస్‌కారణమని తెలుస్తోంది. ఆయన ఆదేశాలతోనే నటిని ముంబైకి వెళ్లి అరెస్టు చేసి విజయవాడ తెచ్చి వేధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇద్దరిపై వేటు వేసింది. వీరి తర్వాత కాదంబరీ జెత్వానీ వేధింపుల వ్యవహారాన్ని వెనుకుండి నడిపించిన ఐపీఎస్‌లు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. జెత్వానీ ఇబ్రహీంపట్నం పీఎస్‌లో మరో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రభుత్వం వీరిపై విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version