https://oktelugu.com/

Prabhas : బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా ప్రభాస్ అవసరం ఉందా..?ఆయన లేకపోతే సక్సెస్ కొట్టలేరా..?

తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న చాలా సినిమాలు ఇండియన్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 14, 2024 / 02:57 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas :  : ప్రస్తుతం ఇండియన్ స్క్రీన్ మీద పెను సంచలనాలను సృష్టిస్తున్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. అత్యంత తక్కువ రోజుల్లో పాన్ ఇండియా సినిమాలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ సినిమాకు భారీ వసూళ్లను రాబడుతున్నాడు. ఇక ఇప్పటికే సలార్, కల్కి రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకున్న ప్రభాస్ కోసం బాలీవుడ్ దర్శకులే కాకుండా హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలైన ఖాన్ త్రయం సైతం ప్రభాస్ తో తమ సినిమాల్లో గెస్ట్ అప్పిరియాన్స్ ఇప్పించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ మురుగదాస్ తో చేస్తున్న సికిందర్ సినిమాలో ప్రభాస్ కోసం ఒక క్యారెక్టర్ ని సృష్టించారట. దాంట్లో ప్రభాస్ కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఒకప్పుడు తెలుగు సినిమా అంటే అసలు పట్టించుకోని ఖాన్ త్రయం సైతం ప్రస్తుతం తెలుగు సినిమా హీరో అయిన ప్రభాస్ కోసం అతనికి ఇచ్చే డేట్స్ కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అంటే తెలుగు సినిమా స్థాయి పెరిగిందనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికైతే ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ను ఢీకొట్టే హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక అలాంటి ప్రభాస్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటే ఫ్యూచర్లో ఆయన మరింత ముందుకు వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే హను రాఘవ పూడి దర్శకత్వంలో చేస్తున్న పౌజీ సినిమా భారీ సక్సెస్ సాధిస్తాననే ప్రభాస్ చాలా మంచి కాన్ఫిడెంట్ ను అయితే వ్యక్తం చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఆయన చాలావరకు మంచి నమ్మకంతో అయితే ఉన్నాడు.

    ఈ రెండు సినిమాలతో దాదాపు 1500 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టి మరోసారి ఇండియన్స్ స్క్రీన్ మీద పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది…ఈ రెండు సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మొత్తానికైతే ఒక తెలుగు హీరో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ మొదటగా తెలుగు సినిమా ఇండస్ట్రీనే గుర్తుకు వస్తుంది…