Homeఆంధ్రప్రదేశ్‌AP Rain Alert: ఏపీకి తీపికబురు.. ఇక అన్నీ మంచి రోజులే

AP Rain Alert: ఏపీకి తీపికబురు.. ఇక అన్నీ మంచి రోజులే

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు అందించింది భారత వాతావరణ శాఖ. జూలై మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావం ఏపీతోపాటు ఒడిస్సా పై అధికంగా ఉంటుందని తెలిపింది. రానున్న రోజుల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల మందగమనం కనిపిస్తోంది. వాటి రాక ఆలస్యం కావడంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. దేశభ్యాప్తంగా 12 రాష్ట్రాలపై ఎప్పటికీ దీని ప్రభావం పడింది. 315 జిల్లాల్లో సగటు కంటే 40 మూడు శాతం లోటు వర్షం కురిసింది. జూలై రెండవ తేదీ నాటికి పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలియడం ఉపశమనం కలిగించే విషయం.

ఉపరితల ఆవర్తనం..
బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో జూలై రెండు నాటికి ఉపరితల ఆవర్తనం బలపడనుంది. అది మూడు, నాలుగు తేదీ నాటికి మరింత బలపడి బంగాళాఖాతంలో.. ఉత్తర ప్రాంతం వైపు కదులుతుంది. క్రమంగా అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం తీరప్రాంత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఏపీ తమిళనాడు తో పాటు తెలంగాణ పై అధిక ప్రభావం చూపి ఛాన్స్ ఉంది. నిజంగా ఇది శుభవార్త. జూన్లో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఆలస్యంగా విస్తరించిన రుతుపవనాలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడతాయని తెలుస్తుండడం ఆనందాన్ని ఇచ్చే విషయం. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం తో పాటు ఉత్తర కోస్తా తీర జిల్లాల్లో వర్షాలు పడవచ్చని చెప్పింది వాతావరణ శాఖ. ఉభయగోదావరి తో పాటు కోస్తాంధ్ర జిల్లాలకు సైతం వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

ఇప్పటికీ వేడి వాతావరణం..
ఇంకా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వేసవి వాతావరణం కొనసాగుతోంది. ఖరీఫ్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయని చెబుతుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా బంగాళాఖాతంలో జూన్ నుంచి నవంబరు వరకు ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడవని అంతా భావిస్తున్న తరుణంలో.. కనీసం ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు పడితే గట్టెక్కవచ్చు అనే ఆలోచనలో రైతాంగం ఉంది. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇవ్వడం పై ఆశలు చిగురిస్తున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper