https://oktelugu.com/

Iftar Dinner : ఏపీలో రేపు ఇఫ్తార్ విందు.. చంద్రబాబుకు ముస్లింల షాక్!

Iftar Dinner:

Written By: , Updated On : March 26, 2025 / 02:08 PM IST
Iftar Dinner in AP

Iftar Dinner in AP

Follow us on

Iftar Dinner : కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉంది తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party). కేంద్ర పెద్దల సైతం సీఎం చంద్రబాబుకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సొంత మెజారిటీతో అధికారంలోకి వస్తామని బిజెపి భావించింది. కానీ 40 సీట్లకు దూరంగా ఉండిపోయింది బిజెపి. ఆ స్థానాన్ని బట్టి చేశారు చంద్రబాబు తో పాటు నితీష్ కుమార్. అందుకే జాతీయస్థాయిలో ఇద్దరు సీనియర్లకు ఎనలేని లభిస్తోంది. అయితే బిజెపితో ఉండడంతో వారికి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ముస్లింల నుంచి నిరసన సెగ ఎదుర్కొంటున్నారు ఆ ఇద్దరు నేతలు. ఇప్పటికే బీహార్ లో నితీష్ పై కదం తొక్కారు ముస్లింలు. చంద్రబాబుపై సైతం అదే ప్రభావం చూపించనున్నారు.

Also Read : ఏపీలో వారికి కూడా అన్నదాత సుఖీభవ.. సీఎం ప్రకటన!

* ముస్లింల వ్యతిరేక వైఖరి..
సాధారణంగా భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) ముస్లింల వ్యతిరేకి అనే ముద్ర ఉంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే పార్టీలను సైతం ముస్లింలు వ్యతిరేకిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే బిజెపి వ్యవహార శైలి ఉంటుంది. ముస్లింలకు సంబంధించి హక్కులను హరించే.. ముస్లింల ఆస్తులను స్వాధీనం చేసుకునే వక్ఫ్ బిల్లును తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి టిడిపి, జెడియు పార్టీలు. దీంతో ఆ రెండు పార్టీలపై ఆగ్రహంగా ఉన్నారు ముస్లింలు. దీంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు నితీష్ అండ్ చంద్రబాబు.

* నితీష్ కు నిరసన..
ఇప్పటికే బీహార్ లో నితీష్ కుమార్ కు( Nitish Kumar) నిరసన సెగ తగిలింది. బీహార్ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ఇఫ్తార్ విందుకు అక్కడ ముస్లింలు బహిష్కరించారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలపడంతోనే తాము ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు బీహార్ ముస్లింలు. అయితే అదే బాటలో ఉన్నారు ఏపీ ముస్లింలు. రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రానికి కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే వరుసగా భేటీలు నిర్వహించిన ముస్లిం సంఘాలు ఈ కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* గుంటూరులో రాష్ట్రస్థాయి విందు
ముస్లింలు రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రభుత్వాలు సైతం అధికారికంగా ఇఫ్తార్ విందులు ఇస్తుంటాయి. ఈ ఏడాది అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందుకు సీఎం చంద్రబాబుతో( CM Chandrababu) పాటు ఉన్నారు. ఇఫ్తార్ విందుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి యాభై లక్షలు మంజూరు చేసింది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక ఇఫ్తార్ విందుకు ముస్లిం సంఘాలు గైర్హాజరు కావడం ఖాయంగా తేలుతోంది. చూడాలి సాయంత్రానికి ఎలాంటి ప్రకటన వస్తుందో..

Also Read: ప్రభుత్వ పై వ్యతిరేక పోస్టులు.. పోలీసులపై హైకోర్టు సంచలన కామెంట్స్!