https://oktelugu.com/

AP High Court : ప్రభుత్వ పై వ్యతిరేక పోస్టులు.. పోలీసులపై హైకోర్టు సంచలన కామెంట్స్!

AP High Court : అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేస్తున్నారు. తాజాగా గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ఫిర్యాదు వచ్చిందో లేదో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తప్పు పట్టింది హైకోర్టు.

Written By: , Updated On : March 26, 2025 / 01:49 PM IST
AP High Court

AP High Court

Follow us on

AP High Court : ఏపీ పోలీసులకు( AP Police ) హైకోర్టు షాక్ ఇచ్చింది. వారి తీరును తప్పు పట్టింది. పనితీరు మార్చుకోవాలని హితవు పలికింది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినా.. దానిపై కూటమి నేతలు ఫిర్యాదు చేసిన మరుక్షణం రంగంలోకి దిగుతున్నారు పోలీసులు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేస్తున్నారు. తాజాగా గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ఫిర్యాదు వచ్చిందో లేదో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తప్పు పట్టింది హైకోర్టు.

Also Read : సమాజానికి చేటు.. హైకోర్టు సంచలన కామెంట్స్.. ఇరకాటంలో బోరుగడ్డ!*

* గతంలోనూ హెచ్చరికలు..
గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) సోషల్ మీడియాను టార్గెట్ చేసుకొని కూటమి ఉక్కు పాదం మోపుతున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయారని.. తాజాగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకేరోజు రాష్ట్రంలో వేలాది కేసులు కూడా నమోదయ్యాయి. చాలామందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పలేదు. అప్పట్లో బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి అటువంటి కేసులో కీలక హెచ్చరికలు చేసింది. ఇది చర్చకు దారితీస్తోంది.

* టోల్ గేట్లపై పోస్ట్..
గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్ ( Prem Kumar)అనే వ్యక్తి.. గుంతల రహదారులు పూడ్చమంటే టోల్ గేట్లు పెడుతున్నారు అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై టిడిపి నేత ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ప్రేమ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన కుమారుడు హైకోర్టులో ఆశ్రయించారు. ఆ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. దీంతో న్యాయమూర్తులు ఒక్కసారిగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపాన్ని ఆపుకుంటున్నామని.. మరోసారి ఇటువంటివి చేస్తే కఠిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించారు.

* సినిమా వారిపై చర్యలు తీసుకోగలరా
సోషల్ మీడియాలో( social media) పోస్టులు పెడితే సమాజానికి తప్పు దోవ పట్టించినట్టా అని పోలీసులను ప్రశ్నించారు న్యాయమూర్తి. అలా అయితే సినిమా హీరోలు, విలన్లపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. అంత సీరియస్గా చర్యలు తీసుకోవడానికి ఎందుకంత శ్రద్ధ అంటూ సంబంధిత సీఐ ను ప్రశ్నించారు న్యాయమూర్తి. మరోసారి సోషల్ మీడియా స్వేచ్ఛను హరిస్తూ ఇటువంటి కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే హైకోర్టు సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : కష్టాల్లో మాజీ మంత్రి రజిని.. ఒకటి కాదు రెండు కాదు.. చాలా తప్పులే!