Pawan Kalya Nara Lokesh Viral Video: ఇటీవలే కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తీ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15 న ప్రారంభించిన ఈ పధకానికి అపూర్వమైన స్పందన దక్కింది. ఎక్కడ చూసినా ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ఆధార్ కార్డు, లేదా ఓటర్ ఇదీ కార్డు, లేదా పాన్ కార్డు ఉంటే చాలు, రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు బస్సు ద్వారా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ పథకాన్ని ప్రారంభించిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఒకే బస్సులో ప్రయాణం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తాడేపల్లి నుండి సభా స్థలం కి బస్సులో ప్రయాణం చేసి అక్కడ కాసేపటి వరకు అందరూ ఈ పథకం గురించి మాట్లాడారు.
Also Read: జగన్ ని కలవబోతున్న జూనియర్ ఎన్టీఆర్??
అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బస్సు ఎక్కే ముందు ఒక దగ్గర కూర్చొని సామాన్యులతో మాట్లాడడం వంటివి స్క్రిప్ట్ ప్రకారం జరిగినదే అట. ఇదంతా కెమెరాలతో షూటింగ్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా చూసిన నెటిజెన్స్ క్లాప్, కెమెరా, యాక్షన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కంటే బయట చాలా బాగా నటిస్తున్నాడు అంటూ ఒక పక్క వైసీపీ నాయకులూ కామెంట్స్ చేస్తుంటే, దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కౌంటర్లు వేస్తున్నారు. అధికారం లో ఉన్నప్పుడు జగన్ ఖాళీ ప్రదేశాల్లో దండాలు పెట్టుకుంటూ ఎన్నో సార్లు కనిపించాడని, దానిని ఆ తర్వాత ఎడిటింగ్ ద్వారా భారీ జనాలు ఉన్నట్టు చూపించేవారని, జగన్ నటన ముందు పవన్ కళ్యాణ్ అసలు సరిపోడని, అలా నటించినందుకు ఆయనకు 11 సీట్లు వచ్చాయని కౌంటర్లు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
Ready … Start Camera.. ACTION.. pic.twitter.com/WapAgTJJrV
— Sukkumarkk (@StrictlyAsking) August 19, 2025