https://oktelugu.com/

Social media News : కువైట్ లో శివను కాపాడింది లోకేష్ కాదా? ఎవరి క్రెడిట్ నో తన ఖాతాలో వేసుకున్నారా? అసలు నిజం ఏంటి?

రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంగా మారుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అధికార విపక్షాల మధ్య రచ్చ నడుస్తోంది. గల్ఫ్ దేశాల్లో బాధితులను కాపాడడంలో కొత్త తరహా రాజకీయం వెలుగు చూస్తోంది.

Written By: Dharma, Updated On : July 29, 2024 3:05 pm
Follow us on

Social media News : ఇటీవల గల్ఫ్ దేశాల్లో చిక్కుకుంటున్న వారు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఎడారి దేశాల్లో చిక్కుకున్నామని.. తమను కాపాడాలని సోషల్ మీడియా వేదికగా బాధితులు కోరుతున్నారు.దీనిపై స్పందిస్తున్న ప్రభుత్వం వారిని స్వస్థలాలకు రప్పించే ఏర్పాట్లు చేస్తోంది. మొన్న ఆ మధ్యన కువైట్లో శివ అనే యువకుడు మోసపోయాడు. ఒక పనిపై తీసుకెళ్లి మరో పని అప్పగించడంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. ఎడారిలో ఒంటెలు,బాతులు, కుక్కలకు ఆహారం పెట్టే పనిలో తనను కుదిర్చారని.. అర్ధరాత్రి రెండు గంటల వరకు పనిచేయిస్తున్నారంటూ శివ కన్నీరు మున్నీరవుతూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చివరకు ఏపీ మంత్రి లోకేష్ దృష్టికి వెళ్ళింది.వెంటనే ఆయన స్పందించి భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. కువైట్లో టిడిపి ఎన్నారై విభాగంతో మాట్లాడారు. ఎడారి ప్రాంతంలో దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివను క్షేమంగా రాయబార కార్యాలయానికి తెచ్చి ఇండియా పంపించారు.దీనిపై శివ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తన విడుదలకు కృషి చేసిన మంత్రి లోకేష్ తో పాటు అధికారులకు,టిడిపి ఎన్నారై విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు.అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు దాటుతోంది. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది.కువైట్లో శివను కాపాడింది టిడిపి ఎన్నారై విభాగం కాదని.. అందులో అసలు లోకేష్ ప్రమేయం లేదని ఓ వ్యక్తి తెలుగులో మాట్లాడుతూ విషయాన్ని వెల్లడించాడు.నిన్ను నేను కాపాడితే.. క్రెడిట్ లోకేష్ కు, టిడిపి ఎన్నారై విభాగానికి ఇస్తావా? అంటూ సదరు వ్యక్తి ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

* ఇటీవల వెలుగు చూస్తున్న బాధితులు
కువైట్లో చిక్కుకున్న శివను కాపాడిన తర్వాత.. గల్ఫ్ లో బాధపడుతున్న బాధితులు ఒక్కొక్కరు సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నారు. తమను కాపాడి స్వస్థలాలకు పంపించాలని పెద్ద ఎత్తున కోరుతున్నారు. అందుకు మంత్రి లోకేష్ స్పందిస్తున్నారు. టిడిపి ఎన్నారై విభాగాల సాయంతో.. భారత రాయబార కార్యాలయాల చొరవతో బాధితులను సొంత ప్రాంతాలకు తీసుకొస్తున్నారు.దీనిపై టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి. లోకేష్ ను హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతోంది.ఈ తరుణంలోనే ఈ వీడియో వైరల్ అవుతుండడం విశేషం.

* బాధితులు చెబుతున్నా
స్వస్థలాలకు చేరుకుంటున్న బాధితులు అధికారులతో పాటు మంత్రి లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. శివ ఎపిసోడ్ తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తిని సైతం సౌదీ అరేబియా నుంచి స్వస్థలానికి తీసుకొచ్చారు.ఆయన సైతం మంత్రి లోకేష్ త్వరలోనే తాను స్వగ్రామానికి చేరుకోగలిగానని ఆనందం వ్యక్తం చేశాడు. అధికారులతో పాటు లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఇందులో లోకేష్ చొరవ అంటూ ఏమీ లేదని..ఎవరిదో క్రెడిట్ తాను దక్కించుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం విశేషం.

* అతి చేస్తున్న టిడిపి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నారై విభాగాన్ని సైతం ఏర్పాటు చేసింది.ఓ మంత్రికి ఆ బాధ్యతలు అప్పగించింది.కొండపల్లి శ్రీనివాసరావు అనే మంత్రికి ఆ శాఖను కేటాయించింది.కానీ గల్ఫ్ దేశాల్లో చిక్కుకుంటున్న వారి విషయంలో మంత్రి లోకేష్ చాలా వేగంగా స్పందిస్తున్నారు.వారిని స్వస్థలాలకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిపై టిడిపి శ్రేణులు అతిగా స్పందిస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అది నచ్చక వైసీపీయే ఇటువంటి వీడియోలను విడుదల చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఏది వాస్తవమో తెలియడం లేదు.