Ring Road: ఇదేందబ్బా.. హైదరాబాద్‌కేమో మరో రింగ్ రోడ్డు.. విజయవాడకేమో బైపాసేనా?

Ring Road: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేవలం సంక్షేమం మీదే ఫోకస్ పెడుతున్నట్లు కన్పిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో జగన్ సర్కార్ ప్రభుత్వ సొమ్మును మొత్తం సంక్షేమానికి ఖర్చు చేస్తోంది. ఈక్రమంలోనే ఏపీలో అభివృద్ధి పనులన్నీ నత్తనడకగా సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ప్రభుత్వం వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడం విఫలం అవుతుండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. జగన్ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో మద్దతు ఇస్తోంది. […]

Written By: NARESH, Updated On : December 17, 2021 5:17 pm
Follow us on

Ring Road: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేవలం సంక్షేమం మీదే ఫోకస్ పెడుతున్నట్లు కన్పిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో జగన్ సర్కార్ ప్రభుత్వ సొమ్మును మొత్తం సంక్షేమానికి ఖర్చు చేస్తోంది. ఈక్రమంలోనే ఏపీలో అభివృద్ధి పనులన్నీ నత్తనడకగా సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ప్రభుత్వం వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడం విఫలం అవుతుండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Rainfall in AP and Telangana

జగన్ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో మద్దతు ఇస్తోంది. అయినప్పటికీ కేంద్రం నుంచి పెండింగులో ఉన్న నిధులు, ప్రాజెక్టులను రాబట్టుకోవడంలో పూర్తిగా వెనుకబడిపోతుంది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీతో అవసరానికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి కావాల్సిన పనులన్నింటిని చక్కబెడుతూ ముందుకెళుతున్నారు. బీజేపీతో కేసీఆర్ కయ్యానికి దిగుతున్న తెలంగాణ అభివృద్ధి విషయంలో మాత్రం కేంద్రం సహకారం అందిస్తూనే ఉంది. కానీ ఏపీ విషయంలో మాత్రం అలాంటిదేమీ జరుగడం లేదు.

దీనంతటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుచూపు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమనే టాక్ విన్పిస్తోంది. కేంద్రంతో సయోధ్య ఉంటున్న జగన్మోహన్మోన్ రెడ్డి ఏపీ ప్రయోజనాల విషయంలో మాత్రం చొరవ చూపడం లేదు. దీంతో కేంద్రం సైతం ఏపీకి ఏమి చేయలేక పోతుందనే వాదనలు విన్పిస్తున్నాయి. హైదరాబాద్ తరహాలోనే ఏపీలోనూ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. గత ప్రభుత్వం ఇందుకోసం భూమిని సేకరించే ప్రయత్నం చేసింది.

హైదరాబాద్లో ఔటర్ రింగ్ వల్ల ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. ఏపీలోనూ ఇలాంటి ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతం కూడా త్వరగా అభివృద్ధి బాట పట్టే అవకాశముంది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేంద్రం అడిగినంత భూమిని ఇవ్వలేమని తేల్చిపారేశారు. దీంతో విజయవాడకు  బైపాస్ మాత్రమే దక్కింది. తమకు భారం తప్పడంతో కేంద్రం సైతం ఈ ప్రాజెక్టును లైట్ తీసుకుంది. దీంతో వచ్చిన అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం చేజార్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: షార్ట్ ఫిల్మ్ చేయాలని పిలిచి.. కెమెరాలతో ఉడాయించి..

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును మైమరింపేలా రిజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ చుట్టురా 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ రీజనల్ రింగ్ రోడ్డు అంశంపై చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల షాద్ నగర్, గజ్వేల్, సంగారెడ్డి, చౌటుప్పల్, భువనగిరిలను హైదరాబాద్‌లో కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ రానుంది.

ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రస్తుతానికి హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డుకు అవతల 40నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రీజనల్‌ రింగ్‌రోడ్డు రానుంది. ఒక్కో అలైన్‌మెంట్‌కు మధ్య మూడు నుంచి ఐదు కిలోమీటర్ల తేడా ఉండేలా దీనిని రూపొందించారు. ప్రస్తుతం అక్కడ అలైన్ మెంట్ రెడీ అవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ మహా నగరాల్లోనే మహానగరంగా ఎదగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఇలాంటి నిర్ణయాలు ఏపీలో మాత్రం కరువయ్యాయనే టాక్ విన్పిస్తోంది.

Also Read: ఏపీకి ప్రత్యేక హోదా.. పుట్టుకొచ్చిన కొత్త ఆశ!