Vijaya Sai Reddy : లేటు వయసులో సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి. ఇప్పటివరకు ఆయన పై వచ్చిన ఆరోపణలు, వివాదాలు ఒక ఎత్తు. తాజా వివాదం మరో ఎత్తు. ఆయనపై సంచలన ఫిర్యాదు వచ్చింది. తాను విదేశాల్లో ఉండగా ఇండియాలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని.. అందుకు ఎంపీ విజయసాయి రెడ్డి కారణమంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దీంతో రెండు రోజులుగా విజయసాయిరెడ్డి పేరు మీడియాలో మార్మోగుతోంది.
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పై ఆమె భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు.దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు కంప్లైంట్ అందించారు. తాను విదేశాల్లో ఉండగా ఇండియాలో ఉన్న తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని చెప్పుకొచ్చారు. తన భార్య ప్రెగ్నెంట్ కావడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, గవర్నమెంట్ లీడర్ సుభాష్ లే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. దీంతో ఇది వైరల్ అంశంగా మారిపోయింది.
లేటు వయసులో ఓ అధికారి భర్త నుంచి ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న విజయసాయిరెడ్డి ఇంతవరకు దీనిపై స్పందించలేదు. ఆయన ఎలా స్పందిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. వైసిపి ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి వ్యవహరించారు. ఆమెకు ఆ పోస్ట్ విజయసాయిరెడ్డి ఇప్పించారని ప్రచారం ఉంది. విశాఖపట్నం పర్యటనలో విజయసాయిరెడ్డి ఉంటే.. ఆయన వెంట శాంతి కూడా కనిపించేవారు.
దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ గా ఉంటూ శాంతి ఎన్నో రకాల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అత్యంత వివాదాస్పద అధికారిగా శాంతికి పేరు ఉంది. దీంతో కొత్త ప్రభుత్వం రాగానే దేవాదాయ శాఖ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశారు. ఇక ఇప్పుడు నేరుగా భర్త దేవాదాయ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం, అందులో విజయ్ సాయి రెడ్డి పేరు ప్రస్తావించడం సంచలనం గా మారుతోంది. గత రెండు రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై విజయసాయిరెడ్డి ఇంతవరకు స్పందించకపోవడం విశేషం.
అయితే దీనిపై తాజాగా శాంతి స్పందించారు. మదన్ మోహన్ తనకు మాజీ భర్తని చెప్పుకొచ్చారు. ఆయనతో 2013లో వివాహమైందని.. ఇద్దరు బిడ్డలు ఉన్నారని.. కానీ ఆయన వేధింపులు భరించలేక 2016లో విడాకులు తీసుకున్నట్లు చెప్పారు. 2020లో సుభాష్ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని కూడా వివరించారు. ప్రస్తుతం సుభాష్ తోనే జీవిస్తున్నానని.. ఆయనతోనే బిడ్డను కన్నానని పేర్కొన్నారు. మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్ మోహన్ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని తాను విశాఖలోనే చూశానని.. శాఖపరమైన అంశాలను చర్చించానని.. విజయ్ సాయి రెడ్డితో తనకు సంబంధం అంట కడుతూ దుష్ప్రచారం చేయడం దారుణమని ఆమె చెప్పుకొస్తున్నారు. గిరిజన మహిళ కావడం వల్లే తనపై ఇలాంటి ఆరోపణలు చేయగలుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఈ వివాదం విజయసాయి రెడ్డి మెడకు చుట్టుకునేలా ఉంది. మరోవైపు మీడియాలో విజయసాయిరెడ్డి పేరు మార్మోగుతోంది. ముసలాడే కానీ మహానుభావుడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా విజయసాయి రెడ్డి ఇంతవరకు స్పందించలేదు. ఆయన ఎలా స్పందిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: How true is the allegation of vijayasai reddys extramarital affair