https://oktelugu.com/

Chandrababu: టీటీడీ బోర్డ్ చైర్మన్, సభ్యుల ఎంపికలో చంద్రబాబు మార్క్ ఎంత వరకూ ఉంది?

తీవ్ర తర్జనభర్జన నడుమ టీటీడీ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. రకరకాల పేర్లు, సమీకరణలు వినిపించాయి. కానీ చివరకు తాను అనుకున్న విధంగా.. కూటమి పార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు చంద్రబాబు.

Written By:
  • Dharma
  • , Updated On : November 1, 2024 / 01:12 PM IST

    CM Chandrababu

    Follow us on

    Chandrababu: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. మరో పది రోజుల్లో ఐదు నెలల పూర్తవుతుంది. ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డును నియమించింది ప్రభుత్వం.సాధారణంగా కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే టిటిడి ట్రస్టు బోర్డును నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం సుదీర్ఘ కసరత్తు తరువాత టీటీడీ ట్రస్ట్ బోర్డును ప్రకటించింది. చైర్మన్ గా టీవీ5 అధినేత బిఆర్ నాయుడు పేరును ఖరారు చేసింది. 24 మంది సభ్యులను సైతం నియమించింది. కూటమి నేపథ్యంలో మూడు పార్టీల సిఫారసులకు పెద్దపీట వేశారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు. ముఖ్యంగా తన సామాజిక వర్గానికి పదవులు ఇచ్చేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు ఉంటాయి. తొలిసారిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పుడు చదలవాడ కృష్ణమూర్తిని టీటీడీ చైర్మన్ గా నియమించారు చంద్రబాబు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. 2019 ఎన్నికలకు ముందు పుట్టా సుధాకర్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. కానీ అప్పట్లో కమ్మ సామాజిక వర్గం నుంచి చాలామంది నేతలు పదవిని ఆశించారు. కానీ చంద్రబాబు ఆ సాహసం చేయలేదు. ఈసారి మాత్రం తన సామాజిక వర్గానికి చెందిన బి.ఆర్ నాయుడుకు పదవి ఇచ్చారు. గత ఐదేళ్లుగా టిడిపికి అనుకూలంగా వ్యవహరించడంలో టీవీ5 ముందుండేది. అందుకే తనకు సహకరించిన.. తన సొంత సామాజిక వర్గం వ్యక్తికి పదవి ఇవ్వగలిగారు చంద్రబాబు.

    * పవన్ సిఫారసులతో ముగ్గురికి
    మూడు పార్టీల కూటమి నడుస్తోంది ఏపీలో. కేంద్రంలోని ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి కూడా. తాను కష్టాల్లో ఉండగా పవన్ అండగా నిలిచారు. పొత్తుకు ముందుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అందుకే ఇప్పుడు టీటీడీ ట్రస్ట్ బోర్డులో సైతం చంద్రబాబు జనసేనకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. పవన్ సిఫారసులు మేరకు ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా జనసేనకు ప్రాతినిధ్యం పెంచుతారని తెలుస్తోంది. కేవలం తనకు అండగా నిలిచి.. కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కారణమన్న కోణంలోనే చంద్రబాబు ఆలోచించారు.

    * కేంద్ర పెద్దలకు గౌరవం
    కేంద్ర పెద్దల సిఫారసులకు సైతం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మహారాష్ట్రతో పాటుగుజరాత్ కు చెందిన వ్యక్తులను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎంపిక చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సిఫారసులు మేరకు ఒకరిని నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వివిధ రంగాల ప్రముఖులు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించారు చంద్రబాబు. సొంత పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు స్థానం ఇచ్చారు. అయితే అన్నింటికీ మించి సొంత సామాజిక వర్గం విషయంలోసానుకూల నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. ఒక్కమాటలో చెప్పాలంటే టీటీడీ ట్రస్ట్ బోర్డులో చంద్రబాబు మార్కు స్పష్టంగా కనిపిస్తోంది.